//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'ట్రిపుల్ ఆర్' కోసం ...యమదొంగ ఫార్ములా వాడుతున్న జక్కన్న

Category : movies

టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం "ఆర్ .ఆర్.ఆర్ " ......ఈ సినిమాలో హీరోలు గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ రామ్‌చరణ్‌ వంటి టాలీవుడ్ టాప్ హీరోస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ భారీ మల్టీస్టారర్ మూవీ ని దాదాపు 300 కోట్ల‌తో ప్రముఖ నిర్మాత డీ .వీ.వీ దానయ్య నిర్మిస్తున్నాడు. ఈ పీరియాడిక్ డ్రామా ను బ్రిటిషర్స్ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో ఎన్టీఆర్ పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో తారక్ బందిపోటు పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

మరోవైపు ఈ సినిమా కోసం రాజమౌళి కథ విషయంతో పాటు డైలాగుల విషయంలో ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది . అప్పట్లో ‘యమదొంగ’ సినిమాలో ఎన్టీఆర్ చెప్పించినట్లు ఈ సినిమాలో కూడా తారక్‌తో పవర్‌ఫుల్ డైలాగులు చెప్పించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే రచయిత సాయి మాధవ్ బుర్రా ను రాజమౌళి పలురకాల వేరియేషన్స్ అడిగినట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఎన్టీఆర్ క్యారెక్టర్ తాలూకు లక్షణాలు,ఆ పాత్ర స్వభావాన్ని క్లియర్ గా చెప్పాడు సాయి కి చెప్పాడు రాజమౌళి.అందుకోసమే సాయి మాధవ్ బుర్రకు పదను పెట్టి మరి ఈ సినిమా కోసం అద్భుతమైన డైలాగులు రాస్తున్నాడట. ముఖ్యంగా ఈసినిమాలో ఎన్టీఆర్ చెప్పే డైలాగులకు థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే అంటున్నారు చిత్ర వర్గాలు.

సాధారణంగా రాజమౌళి ఏ సినిమా తీసిన విజువల్ పరంగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటాడు. లేదా ఆ సినిమాకు సంబంధించిన డైలాగుల విషయంలో ఎక్కువ శ్రద్ద వహిస్తారు. ఈ లెక్కన ఈ సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్ లు ఉండనున్నట్టు తెలుస్తుంది.అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కండలు తిరిగిన దేహంతో కనిపించనున్నాడు. మరోవైపు రామ్ చరణ్ గెటప్ కూడా ఈ సినిమాకు హైలెట్ గా ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీలు ఆలియా భట్, సోనాక్షి సిన్హాలను హీరోయిన్స్‌గా అనుకుంటున్నారని టాక్ .ఎప్పటిలాగే 'ఆర్ఆర్ఆర్‌కు' కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 సమ్మర్ కానుకగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్ . ఈ సినిమాను తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.బాహుబలి సినిమా తరువాత వస్తున్న రాజమౌళి సినిమా కావడం ఇందుకు ప్రత్యేక ఆకర్షణ.

Related News