ఇప్పుడు ఎవ్వరు చూసినా జీమెయిల్ వాడుతున్నారు గానీ ఒకప్పుడు ఈ-మెయిల్ సేవలను అందించడంలో అగ్రస్థానంలో కొనసాగిన కంపెనీ యాహూ అనే చెప్పాలి. కేవలం, ఈ-మెయిల్ మాత్రమే కాదు, సెర్చ్ ఇంజిన్, వార్తలు వంటి అనేక సేవలను నెటిజన్లకు ఈ సంస్థ అందించింది. ఒకానొక సమయంలో గూగుల్ సంస్థను సైతం కొనే స్థాయికి వెళ్ళిన ఈ ఇంటర్నెట్ దిగ్గజం ఇక కాలగర్భంలో కలిసిపోనుంది. అవును ఇది నిజం.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిలబడిన యాహూ.. గతేడాది సంభవించిన 4.4 డాలర్ల నష్టం దెబ్బకు కోలుకోలేని స్థితికి పడిపోయి తన వ్యాపారాన్ని ఎంతో తక్కువ విలువకు విక్రయించేందుకు సిద్ధపడింది. దాని ఫలితమే వెరిజోన్‌తో 4.83 బిలియన్ డాలర్ల ఒప్పందం..యాహూను సొంతం చేసుకున్న వెరిజాన్ కంపెనీ.. తన ఏవోఎల్ మెయిల్‌ను దానితో విలీనం చేసి.. ఓథ్ (ప్రమాణం) పేరిట కొత్త బ్రాండ్‌ను తెరపైకి తీసుకొచ్చింది.ఎఒఎల్ మెయిల్లో యాహూ విలీనమైన తర్వాత ఈ రెండింటినీ కలిపి 'ఓథ్' అనే కొత్త కంపెనీ గొడుగు కిందకు తీసుకురానున్నట్టు ఎఒఎల్ సిఇఒ టిమ్ ఆర్మ్‌స్ట్రాంగ్ ట్విట్టర్లో తెలిపారు.ఇకమీదట ఓథ్ మెయిల్, ఓథ్ ఫైనాన్స్ కంపెనీలు ఇంటర్నెట్ యూజర్లను పలుకరించనున్నాయి