//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అప్పుడే కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చిన యడ్డి

Category : national politics

కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్డి కుమారస్వామి ఎన్నికల లాంచనమైంది. బిజెపి సభ నుంచి వాకౌట్ చెయ్యడంతో స్పీకర్ బలపరీక్ష నిర్వహించలేదు. దీనితో పరస్పరం జెడిఎస్ కాంగ్రెస్ సభ్యులు అభినందనలు తెలుపుకున్నారు. ఇదిలా ఉంటె బలపరీక్షకు ముందు మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప కుమారస్వామికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ‘‘జాతీయ బ్యాంకుల నుంచి రైతులు తీసుకున్న రుణాలు సహా.. రూ. 53 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తామని జేడీఎస్ నేత హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే 24 గంటల్లోగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది మీరే. అయితే ఇప్పుడు మాది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి సొంత నిర్ణయాలు తీసుకోలేమంటూ కథలు చెబితే వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక సమావేశాల్లోనే రుణమాఫీ ప్రకటించాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనకు మేము కార్యాచరణ సిద్ధం చేస్తాం...’’ అని పేర్కొన్నారు.