జోలో మొబైల్ సంస్ద నుంచి 4,444 రూపాయలకే కొత్త స్మార్ట్ ఫోన్ ని భారత్ మార్కెట్ లో విడుదల చేశారు. జోలో ఎరా 4ఎక్స్ పేరిట ఈ ఫోన్ విడుదల అయ్యింది. 5.45" హెచ్.డీ ప్లస్ డిస్ప్లే తో ఈ ఫోన్ ను రూపొందించారు. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ నడుస్తుంది. ఈ ఫోన్ కు ముందు వెనుక కెమెరాలకు ప్లాష్ సదుపాయం ఉంది. అమెజాన్ వెబ్ సైట్లో ఈ నెల 9 నుండి ఈ ఫోన్ ను కొనుగోలు చేసుకోవచ్చు.
జోలో ఎరా 4ఎక్స్ ప్రత్యేకతలు:
5.45" హెచ్.డీ ప్లస్ డిస్ప్లే
ఫేస్ అన్లాక్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ
8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం