//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్ ఫోన్..!

Category : business

కాలంతో పాటు మొబైల్ ఫోన్ ప‌రిమాణం కూడా మారిపోయింది. కొన్ని చిన్న‌గా, మ‌రికొన్ని పెద్ద‌గా ఇలా అన్నిర‌కాల సైజుల్లోనూ మొబైల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే బాట‌లో లండ‌న్‌కి చెందిన క్లూబిట్ న్యూ మీడియా కంపెనీ ప్ర‌పంచంలోనే అతిచిన్న మొబైల్‌ఫోన్‌ను త‌యారుచేసింది. దీనికి 'జాంకో టైనీ టీవ‌న్‌' అని పేరు పెట్టారు. క్రెడిట్ కార్డు కంటే చాలా చిన్న‌గా ఉన్న ఈ ఫోన్‌ను ప్ర‌స్తుతం ప్ర‌యోగాత్మ‌కంగా విడుద‌ల చేశారు.

ఫీచర్ ఫోన్ల హవా నడిచినప్పుడు తొలుత పెద్ద పరిమాణంలో ఉండేవి. క్రమంగా స్లిమ్‌గా, చిన్నగా మారిపోయాయి. తర్వాత స్మార్ట్‌ఫోన్ల హవా మొదలైంది. మొదట చిన్నగా ఉన్న ఫోన్ల పరిమాణం క్రమంగా పెద్దగా మారింది. ఇప్పుడు ఎంత పెద్దగా ఉంటే అంత గొప్ప.

అయితే లండన్‌కు చెందిన క్లూబిట్ న్యూ మీడియా అనే కంపెనీ ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్‌ ఫోన్‌ను విడుదల చేసింది. క్రెడిట్ కార్డు కంటే చిన్నగా ఉండే ఈ ఫోన్‌కు ‘జాంకో టైనీ టీవన్’ అని పేరు  పెట్టారు. 

ప్రయోగాత్మకంగా విడుదల చేసిన ఈ ఫోన్ అథ్లెట్లు, జాగర్లకు బాగా ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. 2జీ ఫోన్ అయిన జాంకో టైనీ టీవన్ ధర రూ.2,563. నానో సిమ్, 300 ఫోన్ బుక్ మెమొరీ, 50 మెసేజ్‌ల వరకు స్టోర్ చేసుకునే సామర్థ్యం, 200 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఢిల్లీకి చెందిన ఈ-కామర్స్ సంస్థ యెర్హా డాట్‌కామ్  గత నెలలో ‘నానోఫోన్ సీ’ పేరుతో అతి చిన్న మొబైల్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.2,999 మాత్రమే.