మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్లో మిథాలీ సేన డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పోటీపడి ఫైనల్ కు చేరింది.భారత క్రీడాకారిణి హర్మన్‌ప్రీత్ కౌర్(171 నాటౌట్) అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో ఢీకొనబోయే భారత జట్టుకి క్రికెటర్లు సచిన్ తెందుల్కర్ తదితరులు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు.
ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారత మహిళలు మంచి ముగింపు ఇచ్చారు. లార్డ్స్ చేరుకున్నారు. ఫైనల్లో ఇంగ్లాండ్‌తో తలపడే మీకు శుభాకాంక్షలు: సచిన్ తెందుల్కర్
హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ అద్భుతం. బౌలర్లు మంచి ప్రదర్శన చేశారు: విరాట్ కోహ్లీ
భారత మహిళల జట్టుకి శుభాకాంక్షలు. ఫైనల్ చేరుకున్న మీకు గుడ్‌లక్: సురేశ్ రైనా
ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో మీ ప్రదర్శన చూసి ఎంతో గర్వపడుతున్నా. ఘన విజయం సాధించిన మీకు శుభాకాంక్షలు. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ మరిచిపోలేనిది: కపిల్ దేవ్
ప్రపంచకప్ సెమీఫైనల్లో జట్టు కనబరిచిన ప్రదర్శన అద్భుతం. ట్రోఫీని అందుకోవడానికి ఎంతో దూరంలో లేము: గౌతమ్ గంభీర్
మిథాలీ సేనకు అభినందనలు. జట్టు ప్రదర్శన అద్భుతం. ఎంతో గర్వంగా ఉంది. ఫైనల్స్‌కి గుడ్‌లక్: వీవీఎస్ లక్ష్మణ్
రెండో సెమీఫైనల్లో అద్భుత విజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లిన భారత మహిళల జట్టుకి అభినందనలు. 171 పరుగుల హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్ అత్యద్భుతం: ఇషాంత్ శర్మ
భారత జట్టు అద్భుత విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్ మరుపురానిది. అమ్మాయిలు ఇక ట్రోఫీని దక్కించుకోండి: యూసఫ్ పఠాన్
ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడావు హర్మన్‌ప్రీత్ కౌర్. కీలక సమయంలో టాప్ క్లాస్ బ్యాటింగ్‌తో అలరించావు:అంజుమ్ చోప్రా
క్రికెట్‌కి పుట్టిల్లు.. లార్డ్స్ మైదానం మీ కోసం ఎదురుచూస్తోంది. మహిళల జట్టుకి ఈ పర్యటన పెద్ద సెన్సెషన్. ట్రోఫీని ముద్దాడేందుకు అడుగు దూరంలో మాత్రమే ఉన్నాం. గర్వంగా ఉంది: మహమ్మద్ కైఫ్
ప్రపంచకప్ ఫైనల్ చేరుకున్న భారత జట్టుకి శుభాకాంక్షలు. హర్మన్‌ప్రీత్ కౌర్
ఇన్నింగ్ చాలా ఏళ్లు గుర్తుండిపోతోంది. వేడుకలు చేసుకోండి: మనోజ్ తివారి
హర్మన్‌ప్రీత్ కౌర్ బ్యాటింగ్ ప్రదర్శన ఔట్‌స్టాండింగ్. క్లీన్ హిట్టింగ్, క్లాస్ నాక్, పంజాబ్ శక్తి చూపించావు: బుమ్రాహర్మన్
ప్రీత్ కౌర్.. నువ్వు రాక్‌స్టార్. అద్భుత ప్రద్శన చేశావు: రవిశాస్త్రి
ఫైనల్ చేరుకున్న భారత మహిళల జట్టుకి శుభాకాంక్షలు. జట్టు కలిసికట్టుగా మంచి ప్రదర్శన చేసింది. ఇంటికి కప్పు తీసుకువచ్చేందుకు ఇక ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది: కేఎల్ రాహుల్
గొప్ప విజయం సాధించిన మిథాలీ సేనకు శుభాకాంక్షలు. ఫైనల్ మ్యాచ్‌కి ఆల్ ద బెస్ట్: దీపా కర్మాకర్
భారత మహిళల జట్టుకి శుభాకాంక్షలు. బ్రిలియంట్ మ్యాచ్. మరోసారి అభిమానులు గర్వపడేలా చేశారు. ఫైనల్‌కి ఆల్ ద బెస్ట్: వివేక్ ఆనంద్ ఒబెరాయ్
భారత మహిళల జట్టుకి శుభాకాంక్షలు. ఫైనల్స్‌కి ఆల్ ద బెస్ట్: శోభ ఓజా
టీమిండియా బాగా ఆడింది. శుభాకాంక్షలు. చెక్ దే ఇండియా. ఫైనల్స్‌కి ఆల్ ద బెస్ట్: హర్ష సంఘవి