//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాధా నన్ను క్షమించండి : గౌతంరెడ్డి

Category : politics

గతంలో విజయవాడ వైసీపీ నేతలు వంగవీటి రాధా, గౌతంరెడ్డిల మద్య తీవ్ర స్థాయిలో విబేధాలు వచ్చాయి.. వంగవీటి రాధా, ఆయన సోదరుడు రంగాలపై వైసీపీ నేత గౌతంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..

ఈ విభేదాల్లో రాధా వేసుకున్న చొక్కా చిరిగిపోయింది. తన తల్లి కిందపడిపోవడంతో రాధా కన్నీరు పెట్టుకున్నారు.. ఇంతటి గొడవ తర్వాత గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వార్తలు కూడా వచ్చాయి.. అలాగే రాధా టీడీపీ లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి..

ఈ నేపథ్యంలో గౌతంరెడ్డి స్పందించారు.. వైసీపీ నుంచి తనకు సస్పెన్షన్ ఉత్తర్వులు అందనేలేదని చెప్పారు. విజయవాడ సెంట్రల్ సీటు రాధాకే అని తనకు జగన్ చెప్పారని… రాధాతో కలసి తాను పని చేస్తానని తెలిపారు.. డైరెక్టుగా చెప్పకపోయిన గౌతంరెడ్డి వంగవీటి రాధకు క్షమాపణలు చెప్పారు..

Related News