//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ vs పవన్ .....మాటల యుద్ధం

Category : politics

రాజకీయం అంటే ఏమిటో కూడా తెలియని వాడు మమ్మల్ని విమర్శిస్తారా అంటూ ఫైర్ అవుతూనే నేనేమి కేంద్రానికి దగ్గర కావాలని చూడట్లేదు. కొందరు ఏదేదో ప్రచారం చేస్తున్నారు కనీస అవగాహనా అంటూ ఉండాలి మీకు అంటూ వై స్ జగన్ ఘాటుగా విమర్శించినా సంగతి తెలిసిందే.

దానికి జవాబుగా మా నాన్నఏమి సీఎం కాదు ,నేనుఇప్పుడే వచ్చా రాజకీయాలకు,అన్నింటిని తెలుసుకుంటున్నాను... ప్రజా సేవ చేస్తాను.. చంద్రబాబు చెప్పినట్లు జనసేన పార్టీ నడవడం లేదు. ప్రజలు చెప్పినట్లు పార్టీ నడుస్తుంది. ఆ విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని అంటూ సోమవారం జరిగిన భూమి పూజకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడారు దీంతో ఇద్దరి నేతల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసిన భగ్గుమంటోందన్న విధంగా తయారైంది పరిస్థితి

మొదట్లో చిన్న నాయకులతో మొదలయి పార్టీ అధినాయకులు సైతం నోరు పారేసుకుంటున్నారు. రాజకీయం లో ఒకరి పై ఒకరు విమర్శించుకోవడం కామన్ నిద్ర లేవడమే చంద్రబాబుని ధ్వజమెతే జగన్ ఇప్పుడు టీడీపీ ని వదిలి జనసేన అధినేత పవన్ కళ్యణ్ పై విమర్శలు చేయడం రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మాత్రమే చెప్పారు.

ఇంతవరకు అస్సలు అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. అలాంటిది జగన్ ఒక్కసారిగా పవన్‌ను విమర్శించడం రాజకీయ విశ్లేషకులకు అర్థం కాని ప్రశ్నలా తయారైంది. మొత్తంమీద జనసేన, వైసిపి నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్థం ఇప్పుడు ఎపిలోనే కాదు అటు తెలంగాణా రాష్టం లో కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది.

ఏది ఏమైనా టీడీపీ ని విడిచి జనసేన ను టార్గెట్ చేయటం పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం చూస్తుంటే 2019 ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కనున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు