//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చెలరేగిన అమ్మాయిలు

Category : sports

ఆసియా కప్‌ మహిళల క్రికెట్‌ చాంపియన్‌షిలో పాకిస్థాన్‌పై టీం ఇండియా ఘన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాక్ ని ఓడించింది. వివరాల్లోకి వెళితే తొలుత టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు ఆది నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చెయ్యడంతో పాక్ జట్టు ఎక్కడా కూడా దూకుడుగా ఆడలేకపోయింది. వికెట్లు కోల్పోకున్నా భారి స్కోర్ సాధించడంలో విఫలమైంది. పాక్ నిర్ణీత 20ఓవర్లకు గాను ఏడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది.

ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా ఆదిలోనే ఓపెనర్ మిథాలి రాజ్ వికెట్ కోల్పోయింది. అ తర్వాత వెంటనే మరో వికెట్ కోల్పోయింది. దీనితో ఇన్నింగ్స్ ని చక్కదిద్దే బాధ్యతను స్మ్రితి మంధన, హర్మాన్ ప్రీత్ కౌర్ ఎత్తుకున్నారు. స్మృతి మంధాన 38 పరుగులు చేసి ఔట్ అయినా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 34 పరుగులతో చివరగా ఓ ఫోర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించింది. పాక్ నిర్ధేశించిన 72 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలోనే పూర్తి చేసింది. దీంతో 7 వికెట్ల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.

Related News