//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహిళా పోలీసు వలంటరీలు కీలకం

Category : national

సమాజానికి మహిళా పోలీసు వలంటరీలు కీలకమని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం బద్వేలు అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో మహిళా పోలీసు వలంటరీల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్ట డంలో, గ్రామాలలో మహిళలపై జరిగే హత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు సంబంధించిన విషయాలు బయటకు రావా లంటే మహిళా వలంటరీలు సమాచారం సేకరించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని గుర్తు చేశారు. అనతంరం బద్వేలు అర్బన్‌, రూరల్‌, గోపవరం, అట్లూరు మండలాలకు చెందిన మహిళల దరఖాస్తులను పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు.

పట్ట ణంలోని ప్రతి వార్డుకూ ముగ్గురుని, మండలాలలోని పంచాయ తీలకు ఇద్దరి చొప్పున ఎంపిక చేసి ఎస్‌పి కార్యాలయానికి నివేదికలు పంపిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో అర్బన్‌ ఎస్‌ఐ చలపతి, రూరల్‌ ఎస్‌ఐ హేమాద్రి, అట్లూరు ఎస్‌ఐ మహమ్మద్‌రఫి, ఎస్‌ఐ-2 నూర్‌అహమ్మద్‌ పాల్గొన్నారు.