//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడికి షాక్ ఇచ్చిన మహిళా ఎమ్మెల్యే

Category : national

ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సావిత్రీబాయి ఫూలే ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. వివరాల్లోకి వెళితే దేశంలో రిజర్వేషన్లు ఎత్తివేయ్యలంటూ గత కొంత కాలంగా బిజెపి ప్రయత్నాలు చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మోడీ సర్కార్ ఎలాంటి స్పందనా తెలియజేయకపోయినా మౌనం వహిస్తూ వస్తుంది. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. “దశాబ్దాల తరబడి ఇస్తున్న రిజర్వేషన్లపై సమీక్ష జరపాలని దేశంలో ఒక వర్గం కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తోంది..దీనిపై బీజేపీ మౌనం దాల్చింది. ఈ మౌనానికి అర్థమేంటి’’ అని ఆమె ప్రశ్నించారు.

అలాగే ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలో లక్నోలో ఓ మహా ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించిన ఆమె... ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం పదును తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వెంటనే అప్పీలు చేయకుండా మోదీ సర్కార్‌ తాత్సారం చేయడం వెనుక కూడా కుట్ర దాగుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉత్తరాదిన గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్ ఇది ఒక రకంగా ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.