//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కూలిన శిక్షణ విమానం.. మహిళా పైలట్, మరొకరి మృతి

Category : national

ప్రైవేటు సంస్థ‌కు చెందిన శిక్ష‌ణ విమానం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కూలింది. మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు స‌మీపంలో ఉన్న వెయిన్‌గంగా న‌ది ద‌గ్గ‌ర ఈ విమానం కూలింది. నేష‌న‌ల్ ఫ్ల‌యింగ్ ట్రైనింగ్ ఇన్స్‌టిట్యూట్‌కు చెందిన పైల‌ట్ రంజ‌న్ గుంటా, స్టూడెంట్ పైల‌ట్ హిమాని ఈ ఘ‌ట‌న‌లో మృతిచెందారు. బుధవారం ఉద‌యం 9.30 నిమిషాల‌కు ప్ర‌మాదం జ‌రిగింది. గోండియా నుంచి టేకాఫ్ తీసుకున్న త‌ర్వాత డియోరి గ్రామం ద‌గ్గ‌ర సాంకేతిక స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైంది. న‌ది స‌మీపంలో విమాన శిథిలాల‌ను పోలీసులు గుర్తించారు.