స్పిరిట్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానం ఫోర్ట్ లాడర్ డేల్ నుంచి డల్లాస్ కు వెళ్తున్నది. విమానం లో ఓ గర్భవతి కూడా ఉన్నది. విమానం టేక్ ఆఫ్ తీసుకున్న 15 నిమిషాలకే తనకు కడుపునొప్పి రావడంతో భరించలేకపోయింది. వెంటనే విమాన సిబ్బందికి తెలియజేయగా.. వెంటనే ఎమర్జెన్సీ లాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగానే పండంటి బాబుకు జన్మనిచ్చింది ఆ మహిళ. అయితే.. విమానంలో ఓ నర్సు, పీడియాట్రీషియన్ ( పిల్లల స్పెషలిస్ట్) ఉండటంతో పెద్ద ముప్పు తప్పింది. తల్లి బిడ్డలకు సరైన సమయంలో ట్రీట్ మెంట్ ఇచ్చి వాళ్లను కాపాడగలిగారు. ఇక.. విమానంలో పుట్టిన ఆ చిన్నారి కి జీవితాంతం విమానాల్లో ఫ్రీ గా ప్రయాణించొచ్చని స్పిరిట్ ఎయిర్ లైన్స్ ఆ చిన్నారికి ఈ స్పెషల్ గిఫ్ట్ ను అందజేసింది.