//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశంలో మరో నిర్భయ ఘటన.

Category : national

దేశంలో మరో నిర్భయ ఘటన చోటుచేసుకుంది. ఎన్ని చట్టాలు ఉన్నా.. శిక్షలు పడుతున్నా.. కామ పిశాచులు మాత్రం లెక్కచేయడం లేదు. మృగాళ్లా వ్యవహరిస్తూ ఆడపిల్లలను చిత్ర హింసలు పెడుతున్నారు. ఇది అలాంటి ఘటనే. హర్యానాలోని కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కామాంధులు రెచ్చిపోయారు. కదులుతున్న కారులో 35 ఏళ్ల మహిళను సామూహిక అత్యాచారం చేశారు. గుర్గావ్ నుంచి గ్రేటర్ నోయిడా వరకు కారులో చిత్రహింసలు పెట్టి మంగళవారం ఉదయం కారులో నుంచి బయటికి తోసేశారు. దారిన పోయేవారు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమె ప్రాణాలు కాపాడారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న మహిళను సమీపంలోని యథార్థ్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆమె రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ నివాసిగా పోలీసులు గుర్తించారు. సోహ్నాలోని తన బంధువుల ఇంటికి గతవారం వచ్చింది. అయితే సోమవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు ఆమెను మారుతీ స్విఫ్ట్ కారులో ఎక్కుంచుకుని రాత్రంతా సామూహిక అత్యాచారం చేసినట్లు గుర్తించారు.

Related News