Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ ప్రముఖ డైరెక్టర్ లేనిదే నేను లేను: అర్జున్...?

Category : movies

యాక్షన్ కింగ్ అంటే గుర్తుచ్చే పేరు అర్జున్. తెలుగు, తమిళ భాషల్లో ఈయనకి మంచి పేరుంది. అయితే తాజాగా అర్జున్ నటిస్తున్న చిత్రం 'కురుక్షేత్రం'.

ఇండస్ట్రీలో నాకు ఏమి తెలియకపోయిన ఆ డైరెక్టర్ వలెనే హీరోగా ఇలా మీముందు నిలుచున్నాను అంటున్నారు అర్జున్. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విధంగా ప్రస్తావించారు.

నాకు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనే కోరిక ఉండేదని, అనుకోని పరిస్థితులలో ఇలా ఇండస్ట్రీ లో కి వచ్చానని అయన అన్నారు. కొంతమంది పుష్ చేయడంవలనే ఇలా వచ్చానని, వచ్చిన కొత్తలో ఏమి చేయాలో తెలిసేది కాదని అయన అన్నారు. కోడి రామకృష్ణగారు దర్శకత్యంలో తెలుగులో మొదటి సినిమాగా 'మా పల్లెలో గోపాలుడు' చేశాను. అప్పుడు నాకు తెలుగు రాదు, కోడి రామకృష్ణగారు ఎలా చేయమంటే అలా చేశాను దాని వలన కోడి రామకృష్ణగారు నాతో చాలా కష్టపడ్డారు. ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి" అని అన్నారు.

#tollywood #Actonheroarjun #tollywoodnews