//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హెల్మెట్ ధరించని వారికి వింత శిక్ష..!

Category : national

ట్రాఫిక్ రూల్స్ ని పాటించండి అని నియమ నిబంధనలు పెట్టినా, హెచ్చరించినా, చలానాలు వేస్తున్నాచలనం ఉండట్లేదని ఒక కొత్త పద్ధతిని చేపట్టారు. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడిపించడం నేరమని తెలిసినా, అది చాలా చిన్న నేరమేలే అన్నట్టు వాహనదారులు ప్రవర్తిస్తుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. పోలీసుల తనిఖీల్లో హెల్మెట్ లేకుండా పట్టుబడితే సాధారణంగా 100 నుంచి 200 వరకూ జరిమానా విధిస్తుంటారు.

జరిమానాలతో ప్రజల్లో చైతన్యం రావడం లేదని భావించిన ఆగ్రా పోలీసులు వింత శిక్ష విధిస్తున్నారు. హెల్మెట్ లేకుండా పట్టుబడిన వారిని అర కిలోమీటరు దూరం బైకును నడిపించాలని ఆదేశిస్తున్నారు. 500 మీటర్ల దూరాన్ని బైక్ ను నెట్టుకుంటూ వెళ్లడం వల్ల వారికి వ్యాయామంతో పాటు ఆ ఘటన గుర్తుండిపోతుందని, ఇకపై హెల్మెట్ ధరించాలన్న ఆలోచన కలుగుతోందని పోలీసులు అంటున్నారు. హెల్మెట్ తో వస్తేనే బండిలో పెట్రోలు పోయాలని కూడా వారు బంకుల యాజమాన్యాలను ఆదేశించినట్లు తెలిపారు.

ఈ వాకింగ్ శిక్ష వాహనదారుల్లో ఎంతవరకూ చైతన్యాన్ని తెస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే, గత సంవత్సరం ఒక్క ఆగ్రాలోనే 1,062 ద్విచక్ర వాహన ప్రమాదాలు నమోదయ్యాయి. దీంతో హెల్మెట్ నిబంధనను కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్న ఉద్దేశంతో పోలీసులు ఈ కొత్త ప్లాన్ వేశారు. ఈ పద్దతి తో కొంత మార్పు, కొన్ని ప్రమాదాలను నివారించవచ్చు.