//single page style gallary page

With the help of Bandla Ganesh, Dil Raju is put on Pawan's line

Category : movies

Click here to read this article in Telugu

బండ్ల గణేష్ సాయంతో పవన్ నీ లైన్ లో పెడుతున్న ...దిల్ రాజు

ఏ చిత్ర పరిశ్రమలో అయిన ఒక అగ్ర నిర్మాత వేరొక నిర్మాతకు సహకరించడం అంటే దాని వెనక లాజిక్ కాస్త ఆలోచించదగినదే. అయితే ఆ తరహా సాయం చేస్తూ ఓ అగ్ర నిర్మాత హాట్ టాపిక్ గా మారారు. ఇంతకీ ఆయన సాయం చేస్తున్నది ఎవరికో తెలుసా...? గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో టాలీవుడ్ అగ్ర నిర్మాత అయిన బండ్ల గణేష్ . ఎంత బ్లాక్ బస్టర్ నిర్మాత అయినా అది ఒకప్పుడు ....? ఇప్పుడు కాదు కదా....? అనే ప్రశ్న మొదలైంది.తాను చేసే పని మద్యలో వదిలి రాజకీయాలు అంటూ అటూ ఇటూ తిరిగి తిరిగి వచ్చాడు. పైగా నటుడిగానూ రీఎంట్రీ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ క్రమంలోనే అతడు నిర్మాతగా ఎంతవరకూ సస్టెయిన్ అవుతాడు....? అన్న సందిగ్ధత అలానే ఉంది. ఇదివరకూ పలు కాంట్రవర్శీలు సహా డిజాస్టర్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఇవన్నీ మార్కెట్ వర్గాలకు రుచించేవి కావు. అయినా అతడు తిరిగి నిర్మాతగా ఎదిగేందుకు సీరియస్ గా ట్రయల్స్ లో ఉన్నాడని తెలుస్తోంది. అయితే ఈ సన్నివేశంలో అతడికి దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత బ్యాకప్ ఇస్తుండడం సర్వత్రా ఆసక్తికర చర్చకు తావిస్తోంది.

గణేష్ నటుడిగా ఉన్నప్పటి నుంచి దిల్ రాజు ఎంతో సన్నిహితుడు. అందుకే ఈ సాయం చేస్తున్నారా...? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది.మరో కోణంలో బ్లాక్ బస్టర్ నిర్మాతను అడ్డు పెట్టుకుని తిరిగి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీకి దిల్ రాజు ఏదైనా స్కెచ్ వేశారా....? అన్న కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇక బండ్లకు సాయం చేసే స్కీమ్ లో వేరొక ఫైనాన్షియర్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఫైనాన్షియర్ సత్యరంగయ్య బండ్లను తిరిగి లైమ్ లైట్ లోకి తెచ్చేందుకు ప్రయత్నాల్లో ఉన్నారట. ఇంతకీ దిల్ రాజు - సత్య రంగయ్య ఏ హీరో కోసం హెల్ప్ చేస్తున్నారు...? అంటే.. నేచురల్ స్టార్ నాని హీరోగా బండ్ల ఓ సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. నాని కాల్షీట్లు లాక్ చేయాలని సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నాడు. అయితే నాని మాత్రం ప్రామిస్ చేయడం లేదట. ఏదోలా నానీని ఒప్పించాలి. అందుకోసం దిల్ రాజు - రంగయ్య బృందం సాయం చేస్తోంది. అయితే సరైన కథ సెట్టయితే చేద్దాంలే....! అని మొహమాటానికి నాని ఓ మాటైతే ఇచ్చాడు కానీ అది ఎంత మేరకు సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.ఈ నేపధ్యంలో నే ఒక నిర్మాత మరో నిర్మాతకు ఈ లెవల్ లో సాయం చేయడం ఇంకెంత వరకు కలిసి వస్తోందొ చూడాలి.

A top producer who is in the film industry is cooperating with another producer that is logically behind it. However, with the help of such a kind, the top producer became the hot topic. Who knows what he's helping? Bandla Ganesh, the producer of Tollywood, is a blockbuster hit like Gabbar Singh. How much block buster is it once? Is not it now? The question was about to go back to politics. The rendering is also an actor. How long will Sustain be as a producer in that order? There is an ambiguity. Dezysters, including many contenders, have suffered seriously. All of these are not marketable for market sectors. However, he seems to be in serious trials to re-produce as a producer. But in this scene, he is backing a top-of-the-art debate with the top producer like Dil Raju.

Dil Raju is very close to Ganesh since he was an actor. Is this doing so? Pawan Kalyan is back with a blockbuster producer in another angle. The new debate comes up. Another financier's name is also known in the scheme to help the carts. Financier Satyagraigayya is in the process of trying to bring back the lime light. Dil Raju - Satya Rangiah is helping a hero for ... That is why natural star Nani is interested in doing a movie car. Nani is trying hard to lock the calculations. But Nani is not promising. Someone should convince me. Dil Raju - Rangayya team is helping. But let's do the right story! Nani has given a word to the movie, but to see how well it succeeds. In this setting, one producer will be looking to another producer to help him in this level.