9 వేల కోట్ల రుణాలు బ్యాంకుల నుండి తీసుకొని ఎగవేసిన విజయ్ మాల్యాను లండన్ లో మంగళవారం యూకే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అరెస్ట్ చేసిన మాల్యాను అక్కడి నుండి వెస్ట్ మినిస్టర్స్ కోర్టుకు హాజరు పరచగా, ఎవరు ఊహించని విధంగా మాల్యాకు వెస్ట్ మినిస్టర్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అంత పెద్ద స్కాములో అరెస్ట్ అయినా 3 గంటలోపే మాల్యాకు బెయిల్ రావటం గమన్హారం.దీంతో భారత కేంద్ర ప్రభుత్వం మరోసారి విజయ్ మాల్యాను భారత్ కు రప్పించే ప్రయత్నం విఫలమైనట్లే కనిపిస్తుంది.దింతో మాల్యాకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.