//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

150 వికెట్లతో అశ్విన్, 200 సిక్స్‌లతో ధోని రికార్డులు

Category : sports

అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో భారత స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 150 వికెట్ల క్లబ్‌లో చేరగా, ధోని 200వ సిక్సర్ తో రికార్డులు నెలకొల్పారు. అత్యంత వేగంగా 150 వికెట్లు రెండో భారత స్పిన్నర్‌గా అశ్విన్ నిలవగా, దేశంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును ధోని కైవసం చేసుకున్నారు.  వెస్టిండీస్‌తోఆంటిగ్వాలో జరిగిన మూడో వన్డేలో వీరిద్దరూ ఈ ఘనత సాధించారు. 

అశ్విన్‌కి ఇది 111వ వన్డే మ్యాచ్. తక్కువ మ్యాచుల్లో 150 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కుంబ్లే 106 మ్యాచుల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు.కుంబ్లే, అశ్విన్‌లతో పాటు మరో ఇద్దరు భారత స్పిన్నర్లు వన్డేల్లో 150 వికెట్లు సాధించారు. హర్భజన్ సింగ్ 122 మ్యాచుల్లో 150 వికెట్లు సాధించగా,  రవీంద్ర జడేజా 129 మ్యాచ్‌లు ఆడి 150 క్లబ్‌లో చేరాడు. మరోవైపు విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. విదేశీ గడ్డపై అశ్విన్‌కు ఇదే (3/28) అత్యుత్తమం.

కాగా, ఈ మ్యాచ్‌లో భారత జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ధోనీ రెండు సిక్స్‌లు నమోదు చేయడంతో వన్డేల్లో ధోనీ భారత్‌ తరఫున అత్యధికంగా 200పైగా సిక్స్‌లు బాదిన ఆటగాడిగా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటి వరకు ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌(వన్డే, టెస్టు, టీ20)లో 322 సిక్స్‌లు సాధించాడు. పాక్‌కు చెందిన షాహిద్‌ అఫ్రిది అత్యధికంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 476 సిక్స్‌లు సాధించగా ఆ తర్వాతి స్థానాల్లో క్రిస్‌ గేల్‌(434), బ్రెండన్‌ మెక్‌కలమ్‌(398), సనత్‌ జయసూర్య(352) ఉన్నారు.

Related News