//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విప్రో చైర్మన్‌ అజీమ్ ప్రేమ్‌జీ వీడ్కోలు!

Category : technology

బెంగళూరు విప్రో చైర్మన్‌ అజీమ్ ప్రేమ్‌జీ మంగళవారం చివరిసారి వార్షిక సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. విప్రో భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ఐటీ సంస్థ ముఖ్యంగా డిజిటల్, క్లౌడ్, ఇంజినీరింగ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ అనే నాలుగు న్యూ-ఏజ్ టెక్నాలజీ లపై దృష్టి సారించిందన్నారు. ఇందుకోసం కొత్త వ్యూహాలు అమలు చేయనుందన్నారు.ఆ 4 విభాగాలపై భారీ పెట్టుబడి అజీమ్ ప్రేమ్‌జీ ఐదు దశాబ్దాల తర్వాత.

ఈ నెలాఖరున కంపెనీ చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగి, తన తనయుడు రిషద్ ప్రేమ్‌జీ కి బాధ్యతలు అప్పగిస్తున్నారు. అజీమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫౌండర్ చైర్మన్‌గా మాత్రమే ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన 73వ AGM లో షేర్ హోల్డర్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. బోర్డు అప్రూవల్ అనంతరం పై నాలుగు రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. కొత్త టెక్నాలజీలపై దృష్టి సారిస్తూనే గత సంవత్సరం డేటా సెంటర్ బిజినెస్‌ ను అక్వైర్ చేసుకున్న అంశాన్ని ప్రస్తావించారు.