//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూ.12 వేలకే మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10 ఎస్‌ ల్యాప్‌టాప్‌

Category : business

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10 ఎస్‌ పేరుతో సరికొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. ఇది ప్రత్యేకంగా విద్యార్థుల కోసం రూపొందించిన స్పెషల్‌ ఎడిషన్‌. 'విండోస్‌ 10 ఎస్‌' పేరుతో విడుదలైన ఈ ల్యాపీలోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో ప్రత్యేకంగా విద్యార్థులకు అవసరమైన పలు పాఠ్యాంశాలను సులువుగా నేర్చుకునేందుకు వీలుగా ఈ ఓఎస్‌ను తీర్చిదిద్దారు. అయితే విండోస్‌ 10 ఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో డిఫాల్ట్‌ ఇంటర్నెట్‌ బ్రౌజర్‌గా మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ ఉంటుంది. దీనిని వినియోగదారులు మార్చలేరు. అదేవిధంగా ఈ ఓఎస్‌ ఉన్న పీసీలో సాఫ్ట్‌వేర్లను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే అది మైక్రోసాఫ్ట్‌ వెరిఫైడ్‌ సెక్యూరిటీ అండ్‌ ఇంటెగ్రిటీ ద్వారానే వీలవుతుంది. దీనివల్ల పీసీకి పూర్తి స్థాయి రక్షణ లభిస్తుందని, వైరస్‌లు, మాల్‌వేర్‌లు అంత సులభంగా వ్యాపించేందుకు వీలుండదని ఆ సంస్థ చెబుతోంది. అయితే... ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్‌-10 ప్రొఫెషనల్‌ ఓఎస్‌లా పనిచేయదు. కొంత తక్కువ సామర్థ్యం కలిగి వుంటుంది. అలాగే అన్ని డివైస్‌లకు సపోర్ట్‌ చేయదు. అయితే ఈ ఓఎస్‌ ఉన్న పీసీలను వాడే వారికి మాత్రం మైక్రోసాఫ్ట్‌ ఓ ఆఫర్‌ను అందజేయనుంది. విండోస్‌10ఎస్‌ను విండోస్‌ 10 ప్రొఫెషనల్‌కి అప్‌గ్రేడ్‌ చేసుకోవాలంటే రూ.3,140 చెల్లించాల్సి వుంటుంది. సాఫ్ట్‌వేర్‌ కొత్త వెర్షన్‌కు అప్‌గ్రేడ్‌ అవడంతో ఏకంగా విండోస్‌ 10 ప్రొఫెషనల్‌ ఎడిషన్‌నే విద్యార్థులు కూడా వాడుకోవచ్చు. మనదేశంలో జూన్‌ నుంచి మార్కెట్‌లోకి రానున్న ఈ విండోస్‌ 10 ఎస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ప్రారంభ ధర రూ.12వేలు.