//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తొలి ప్రయత్నంలోనే గోల్డ్ మెడల్..!

Category : sports

భారత యువ షూటర్ షాజర్ రిజ్వీ మెక్సికోలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌ పోటీల్లో గెలిచాడు . తొలి ప్రయత్నంలోనే బంగారు పతకం సాధించి పెట్టాడు. బంగారు పతకంతో పాటు ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పి శభాష్ అనిపించుకున్నాడు.

పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో అతను ఈ ఘనత పొందాడు . శనివారం రాత్రి జరిగిన ఈ పోటీలో రిజ్వీ మొత్తం 242.3 పాయింట్లు సాధించి తన ప్రత్యర్థి క్రిస్టియన్ రీట్జ్ పై గెలిచాడు . ఇంకో భారత షూటర్ జితూ రాయ్ కూడా ఇదే ఈవెంట్‌లో 219 పాయింట్లు చేసి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మరో భారత షూటర్ ఓమ్ ప్రకాశ్ మిథర్వాల్ 198.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు .

మహిళా క్రీడాకారిణులు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో మెహులి ఘోష్ 228.4 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మన దేశానికి చెందిన ఇతర మహిళా షూటర్లు అంజుమ్ మౌద్‌గిల్, అపూర్వి చండేలా కూడా రాణించారు.