//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

2019లో టీడీపీని గెలిపించేది ఎవరో తెలుసా..!

Category : politics

ఏపీ లో ఉండే ప్రస్తుత పరిస్థితులలో ఏ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తుంది అని చెప్పడం చాల కష్టముగా ఉంది.ఒక పక్క చంద్రబాబు నాయుడు నేను చాల చేశాను అని చెప్పుకుంటూ పోతున్నాడు,మరోపక్క జగన్ పాదయాత్ర చేసుకుంటూ తన ఉనికిని పెంచుకుంటూ పోతున్నాడు.

ఏపీలో టీడీపీతో పొత్తు లేక‌పోతే బీజేపీ ప‌రిస్థితి ఏంట‌న్న ఒక్క ప్ర‌శ్న‌కు సూటిగా చెప్పాలంటే అస‌లు ఆ పార్టీ అనేది ఒక‌టుంద‌ని ఏపీలో ఎవ్వ‌రికి గుర్తే ఉండ‌దు. ఇది టీడీపీ వెంట న‌డ‌వ‌క‌పోతే ఏపీలో బీజేపీ దుస్థితి దీన‌స్థితి.

అలంటి పరిస్థితి లో బీజేపీ,టీడీపీ వెంట నడిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లో తన వంతు పాత్ర ను పోషించింది.ఇప్పుడు అదే బీజేపీ నాయకులూ చంద్రబాబు ఫై విమర్శలు చేస్తున్నారు.కాబట్టి మల్లి చంద్రబాబు బీజేపీ వాళ్లకు టికెట్ ఇచ్చే విషయం లో ఆలోచిస్తాడని అందరూ అనుకుంటున్నారు.

ఈ బీజేపీ లీడ‌ర్ల లిస్టులో ముందుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజే ఉంటాడు. చంద్ర‌బాబు ద‌య‌తో ఎమ్మెల్సీ అయిన వీర్రాజు అప్ప‌టి నుంచి మిత్ర‌ధ‌ర్మం, క‌ట్టుబాట్లు పూర్తిగా వ‌దిలేసి ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడుతున్నాడు.

ఇక గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రులుగా ప‌ద‌వులు చేబట్టిన కావూరు, క‌న్నా, పురందేశ్వ‌రి లాంటి వాళ్ల‌ను చంద్ర‌బాబు జీవితంలో ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డు.దీంతో వీళ్ల‌కు ఇప్పుడు బీజేపీ రాజ‌కీయ పున‌రావాసం ఇచ్చింది. ఆ పార్టీలో ఉంటే జీవితంలో ఎండింగ్ వ‌ర‌కు మ‌ళ్లీ ప‌ద‌వి అనేది రాద‌ని వీళ్ల‌కు తెలిసిపోయింది.

కాంగ్రెస్ రాష్ట్రం ఇచ్చింది ఎన్నిక‌ల త‌ర్వాత చూస్తే ఇక్క‌డ టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ భూస్థాపితం అయ్యింది. అన్నింటికి మించి నాడు ఆ స‌ల‌హా ఇచ్చి కాంగ్రెస్‌ను నిండా ముంచిన వాళ్లే ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. తెలంగాణ‌లో తెలుగుదేశం ప‌నిపోయింద‌ని ఇక్క‌డ జ‌గ‌న్‌తో మ‌నం క‌లిస్తే ఎక్కువ సీట్లు గెలుచుకుంటాం ఇక్క‌డ కూడా తెలుగుదేశం ప‌నైపోతుంద‌ని ఇప్పుడు చంద్ర‌బాబుపై లేనిపోని మాటలు కేంద్రానికి నూరిపోస్తున్నార‌ట‌.

కేంద్ర పధకాలు చంద్రబాబు తన పేరు మీద చెప్పుకుంటున్నాడు అని. ఇప్పుడు ఆంధ్ర‌లో బీజేపీపై ఉన్న వ్యతిరేకత బిజెపి హై కమాండ్ కి తెలియనివ్వరు. అంత బానే ఉంది అని మానేజ్ చేసి రేపు బీజేపీ వైసీపీతో వెళ్లి నాశ‌నం అయ్యే దాకా వీళ్లు స‌ల‌హాలు ఇస్తూనే ఉంటారు.

అదే జ‌రిగితే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వీళ్లు టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించి మ‌రోసారి సీఎంగా చంద్ర‌బాబును పీఠంపై కూర్చోపెట్టేందుకు త‌మ వంతుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టే వుంది అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారు.