//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వింబుల్డన్‌ టోర్నీకి 140 ఏళ్లు!

Category : sports

ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీకి ఎంతో ప్రత్యేకత ఉంది. సుధీర్ఘ చరిత్ర కలిగిన వింబుల్డన్‌ ట్రోఫీని దక్కించుకోవాలని ప్రతి టెన్నిస్ క్రీడాకారుడు కలలు కంటాడు. అలాంటి వింబుల్డన్ టోర్నీ నేటి నుంచి ప్రారంభంకానుంది. అయితే నాలుగు గ్రాండ్ స్లామ్స్‌లో ఒకటైన ఈ వింబుల్డన్‌ చాంపియన్‌షిప్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇది 140వ వింబుల్డన్ టైటిల్. అంటే వింబుల్డన్‌ను ప్రారంభించి 140 ఏళ్లు పూర్తయిందన్న మాట. జులై 3 నుండి 140 వింబుల్డన్ టోర్నీ ఆరంభమవుతోంది. జులై 15 వరకు జరుగుతుంది.

ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లోని వింబుల్డన్‌లో ఏటా జరిగే ఈ వింబుల్డన్ చాంపియన్‌షిప్స్ టోర్నమెంట్‌ను 1877‌లో తొలిసారి నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన టెన్నిస్ టోర్నమెంట్ ఇది. వింబుల్డన్ పోటీలను గ్రాస్ కోర్టుపై నిర్వహిస్తారు. 1877 జులై 9న నిర్వహించిన తొలి టోర్నమెంట్‌లో కేవలం జెంటిల్‌మన్ సింగిల్స్ మాత్రమే నిర్వహించారు. తొలి టైటిల్‌ను ఇంగ్లండ్‌కు చెందిన స్పెన్సర్ విలియమ్ గోర్ గెలుపొందారు.

వింబుల్డన్‌ను పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక సార్లు గెలుచుకున్న ఆటగాళ్లలో విలియమ్ రెన్షా, పీట్ సంప్రాస్, రోజర్ ఫెదరర్ ఉన్నారు. వీరు ముగ్గురూ ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని 7 సార్లు సొంతం చేసుకున్నారు. ఇక మహిళ సింగిల్స్‌ను మార్టినా నవ్రతిలోవా అత్యధికంగా 9 సార్లు కైవసం చేసుకుంది. కాగా, ఈ ఏడాది వింబుల్డన్ పురుషుల పోరు రసవత్తరంగా ఉండనుంది. హేమాహేమీలు రోజరర్ ఫెదరర్, రఫెల్ నాదల్, జొకోవిచ్, ఆండీ ముర్రే.. ఈ నలుగురు సెమీస్‌లో తలపడే అవకాశాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే వింబుల్డన్ 140 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్‌తో గౌరవించింది.

Related News