//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సైకిల్ ఎక్కనున్న వంగవీటి ... ఎంపీగా పోటీ చేసే అవకాశం

Category : politics state

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కాపు నేత వంగవీటి రాధాకృష్ణ ఎట్టకేలకు టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. జగన్ పార్టీలో ఉంటే వ్యక్తిత్వాన్ని చంపుకోవాల్సి వస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధాకృష్ణ గతంలోని టిడిపిలో చేరుతారని అందరూ భావించారు. అయితే చాలా కాలం తాత్సారం చేసిన తర్వాత ఫైనల్ గా టీడీపీలో చేరడానికి ఆయన సిద్ధమైపోయారు. కొండ ప్రాంత వాసులకు ఇళ్ల పట్టాలు ఇస్తే టిడిపిలో చేరుతానని ప్రకటించిన వంగవీటి రాధాకృష్ణ ఆ కోరిక నెరవేరడంతో నే టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారని ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో విజయవాడలో కీలక నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ టిడిపిలో చేరడం టిడిపికి కలిసి వచ్చే అంశం.

వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరటానికి రంగం సిధ్దమైంది, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, రాధాను సోమవారం రాత్రి 12న్నర తర్వాత చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకు వచ్చారు. టీడీపీలో చేరిక పై రాధా చంద్రబాబు తో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు. వంగవీటి రాధాకు మచిలీపట్నం పార్లమెంట్ టికెట్ ఇచ్చేఅవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ కి రాజీనామా చేసిన రాధా చాలాకాలంగా టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతూ వస్తోంది.

వైసీపీ కి రాజీనామా చేసిన తర్వాత, టీడీపీ లో చేరాలంటే విజయవాడలో సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న కొండప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేయాలని రాధా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రాధా పలు ప్రెస్ మీట్ లలో కూడా అదే డిమాండ్ చేస్తూ వచ్చారు. రాధా డిమాండ్ చేసిన కొన్నాళ్లకే ప్రభుత్వం కొండ ప్రాంత వాసులకు ఇళ్లపట్టాలు మంజూరు చేసింది. దీంతో తన తండ్రి చివరి కోరికను తీర్చిన పార్టీగా టీడీపీ ఉంది కనుక తాను టీడీపీ లో చేరేందుకు సిధ్దమయ్యానని తన కార్యకర్తలకు చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా చంద్రబాబు తో భేటీలో ఏఏ అంశాలు ప్రస్తావించారు, రాజకీయంగా ఎటువంటి హామీలు లభించాయనేది తెలియాల్సి ఉంది.