//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్టాలిన్ తో రజనీకాంత్ చేతులు కలుపుతారా ?

Category : national

తన రాజకీయ ప్రవేశం గురించి కీలక నిర్ణయం తీసుకొనే దిశలో జరిగిన తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అభిమానులతో ఐదు రోజుల సమావేశాలు శనివారంతో ముగిసినా ఈ విషయమై స్పష్టత ఇవ్వలేక పోయారు. రాజకీయ ప్రవేశం తధ్యం అనే సంకేతం ఇచ్చినా ఏ రూపంలో అనే విషయమై దాటవేత ధోరణి ఆవలంభిస్తున్నారు. 

అయితే ఈ సందర్భంగా డీయంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు యం కె స్టాలిన్ పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించడం, సమర్ధుడైన నేతగా స్టాలిన్ ను పేర్కొనడం రాజకీయ వర్గాలకు ఆసక్తి కలిగిస్తున్నది. ఇప్పటికే బిజెపి, ఏఐడీయంకే లతో కలసే ప్రసక్తి లేదని స్పష్టం చేసిన ఆయన డీయంకే తో వ్యూహాత్మక అవగాహనకు వస్తారా అనే చర్చలు జరుగుతున్నాయి. 

20 ఏళ్ళ క్రితం ఎన్నికల్లో డీయంకే కు మద్దతు ఇవ్వడమే తాను చేసిన పెద్ద పొరపాటని అన్న  సూపర్ స్టార్ ఇప్పుడు స్టాలిన్ తో ఎటువంటి పొత్తుకు సంకేతం ఇస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ప్రస్తుత వ్యవస్థలో స్టాలిన్ ఏమీ చేయలేక  పోతున్నారని సానుభూతి చూపిన రజని  చేయూత ఇచ్చి అధికారంలోకి రావడానికి సహకరిస్తారా అనే అనుమానాలు సహితం వ్యక్తమవుతున్నాయి. రాజ‌కీయాల్లోకి ప్రవేశించే అంశమై నేరుగా ప్రకటన చేయకుండా రోజుకోరకంగా ట్విస్ట్ లతో  ఉత్కంఠ పెంచుతున్నారు. 

మరోవంక తనను మంచి స్నేహితుడు  అనడం పట్ల స్టాలిన్ స్పందిస్తూ స్నేహితుడిగా భావించిన రజనీకి కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ ప్రవేశంపై రజనీ త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

అయితే బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ స్టాలిన్ హెచ్చరించారు. తమిళనాడులో పాగా  వేయాలని బీజేపీ చూస్తోందని అందుకే ముందుగా జాగ్రత్త పడాల్సిన ఎంతైనా ఉందని అన్నారు.