//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రజాసంక్షేమమే సినిమాల్లో నటించడం వాయిదా...... పవన్ కళ్యాణ్

Category : national politics

జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ సంచల నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే నటనకు గుడ్‌బై చెప్పనున్నట్టు ప్రకటించారు. సినిమాల కంటే ప్రజాసంక్షేమమే తనకు ముఖ్యమని ఆయన ప్రకటించారు. జనసేనలో వక్తలు, కంటెంట్‌ రచయితలు, విశ్లేషకులుగా పనిచేసేం దుకు ముందుకొచ్చిన అనంతపురం జిల్లా నూతన నాయకులతో పవన్‌ ఆదివారం సమావేశమయ్యారు. సుమారు 150 మంది నాయకులు ఇందులో పాల్గొన్నారు.ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేస్తానని ప్రకటించారు. అలాగే, ఆరు నూరైనా అనంతపురం జిల్లా నుంచే పోటీచేస్తానని స్పష్టం చేశారు. తన తుది శ్వాస వరకూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానన్నారు.

Related News