Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీ లో కింగ్ మేకర్ గా పవన్ కళ్యాణ్..

Category : state politics

ఏపీ లో ఎన్నికల ఫలితాల సమయాన ఆ పార్టీ వాళ్లు ఆ పార్టీ అధినేత కింగ్ అని చెప్పుకుంటున్నారు .అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిడిపి పార్టీ అధికారం మాది అంటే మాది అని సమీక్షలు సమావేశాలు వేసుకొని లెక్కలు కడుతున్నారు .కానీ జనసేన కార్యకర్తలు మాత్రం ఎవరు అధికారం రావాలి అన్న పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలి అని చెపుతున్నారు..

ఈ ఎన్నికల్లో జనసేన పార్టీకి 20 నుంచి 30 సీట్లు వస్తాయని గాజువాక భీమవరం లో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపిస్తారని అన్ని జిల్లాల్లో సీట్లు ఓపెన్ చేస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.ప్రజలు మార్పు కోరుకుంటున్నారని సైలెంట్ ఓటింగ్ జరిగిందని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మాత్రం పవన్ సపోర్ట్ తోనే టిడిపి పార్టీ అధికారం చేపట్టిన వైసిపి పార్టీ అధికారం చేపట్టిన జరుగుతుందని ఏపీలో మే 23 న కింగ్ గా పవన్ కళ్యాణ్ అని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఏ పార్టీకి కి అధికారానికి సంపూర్ణ మెజారిటీ రాదు అని కర్ణాటక తరహాలో 37 సీట్లతో జెడిఎస్ కుమారస్వామి సీఎం అయినట్టు ఏపీలో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.

Related News