//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిజెపి ఈవీఎంలతో మోసం చేస్తుందా..?

Category : national politics

బిజెపి ఈవీఎంలతో మోసం చేస్తుందా..? ఆ పార్టీ విజయ రహస్యం అదేనా..? అంటే అవుననే అంటున్నారు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. లక్నోలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కైరానా, నూర్‌పూర్ ఉప ఎన్నికల్లో ఈవీఎంలు, వీవీపాట్‌లు సరిగా పనిచేయకపోవడంపై ఆయన మాట్లాడుతూ దేశంలో జరిగే భవిష్యత్ ఎన్నికల్లోనైనా పేపర్ బ్యాలెట్లు ఉపయోగించాలని డిమాండ్ చేశారు.

లక్నోలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అఖిలేష్ మాట్లాడుతూ, మహాకూటమి అభ్యర్థులకు గట్టి పట్టున్న ప్రాంతాల్లోనే ఈవీఎం, వీవీపాట్‌లో ఎందుకు సరిగా పనిచేయ లేదన్న దానిపై విచారణ జరపాలన్నారు. 'ఇవాళ ఈవీఎంలు, వీవీపాట్‌లపై జనం నమ్మకం కోల్పోయారు. ఇంకెంతమాత్రం వాటిని ప్రజలు విశ్వసించాలనుకోవడం లేదు.

ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా బ్యాలెట్ పేపర్లను వాడుతుంటే మనం బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు ఎందుకు జరపలేం?' ప్రశ్నించారు. 'ఘట్‌బంధన్' అభ్యర్థులు బలంగా ఉన్నచోటే ఈవీఎంలు పనిచేయలేదంటూ దీని వెనుక ఏదో వ్యూహం ఉండి ఉండాలని, కూటమి అభ్యర్థులకు పట్టున్న ప్రాంతాల్లో లాఠీచార్జీ జరపడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. అన్నీ పార్టీలు ఈసీ వద్దకు ఫిర్యాదుకు వెళ్లే, తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ కూడా ఈసీ ఫిర్యాదుకు వెళ్లిందన్నారు.

Related News