//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వెంకటేశ్వర స్వామివారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు?

Category : editorial

తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయంలోని మూలవిరాట్టు గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు.దీనివెనుక ఉన్న అర్ధం ఏమిటో మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే ఈ కథనాన్ని చదవండి.స్వామి అలంకరణ కోసం పుష్పానందన వనాన్నిపెంచాలని రామానుజాచార్యుల వారు తన యొక్క శిష్యుడు అనంతాళ్వార్‌ను ఆదేశించారు. ఈ పనిలో అనంతాళ్వార్ యొక్క సతీమణి కూడా పాలుపంచుకుంది.గర్భవతిగా ఉన్న ఆమె తవ్విన మట్టిని గంపలో తీసుకెళుతూ అలసిపోయి కింద పడిపోతుంది.

ఈ విషయాన్ని గుర్తించిన శ్రీనివాసుడు బాలుడి రూపంలో ఆమెకు సహాయపడతాడు.దైవకార్యంలో ఇతరులెవరూ జోక్యం చేసుకోకూడదంటూ ఆ బాలుడిని అనంతాళ్వార్ బాగా కొడతాడు. గడ్డంపై భాగంలో దెబ్బ తగలడంతో ఆ బాలుడు అదృశ్యమై పోతాడు.తర్వాత అనంతాళ్వార్ ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటాడు.స్వామికి గడ్డంపై నుంచి రక్తం కారడం చూసిన అనంతాళ్వార్ ఆ బాలుడు సాక్షాత్తూ శ్రీహరేనని గ్రహించి రక్తం కారకుండా గడ్డం కింద పచ్చకర్పూరం పెడతాడు.అందుకే నేటికీ కూడా మూలవిరాట్ గడ్డం కింద పచ్చకర్పూరం పెడుతున్నారు