//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రేవంత్ వర్గంలో టెన్షన్ అందుకేనా ?

Category : politics

తెలంగాణలో టీడీపీని వీడి కాంగ్రెస్ గూటిని చేరిన వలస నాయకుల స్థితి అగమ్య గోచరంగా ఉంది. టీడీపీ లో ఎమ్మెల్యేలుగా పని చేసిన సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరింది టికెట్ ఇస్తారన్న ఆశతో.. కానీ ఆ ఆశలన్నీ అడియాశలయ్యేలా కనిపిస్తున్నాయి. టికెట్ ఆశిస్తున్న నాయకులకు మహాకూటమి పొత్తులు అశనిపాతంలా తయారయ్యాయి. అసలే పార్టీ లో అప్పటికే ఉన్న నేత హడావిడి ఒకవైపు, మరోపక్క పొత్తులతో తమ పరిస్థితి ఏమిటో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉన్నారు రేవంత్ వర్గ నాయకులు.

తెలంగాణా ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పాలనలో ముఖ్యనాయకులు టీఆర్ఎస్ లో చేరారు . అయినా టీడీపీలోనే ఉండి చాలా కాలం పోరాటం చేసిన రేవంత్ రెడ్డి ఇక టీడీపీలో ఉంటే లాభం లేదని కాంగ్రెస్ తీర్ధం తీసుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ లోని ఆయన వర్గం కూడా కాంగ్రెస్ లో చేరింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి మాజీ ఎమ్మెల్యేలు వేం నరేందర్ రెడ్డి, సీతక్కలు కాంగ్రెస్ లో చేరి టికెట్ ఆశించారు. అయితే టికెట్ ఇస్తారన్న నమ్మకంతో పార్టీలో చేరిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. వరంగల్ పశ్చిమ నుండి వేం నరేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే సీతక్క ములుగు నుండి టికెట్ ఆశిస్తుంది.

పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి టికెట్ ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. అలాగీ ములుగు నుండి పొడెం వీరయ్య సైతం టికెట్ రేసులో ఉన్నారు. అసలే పొత్తులతో ఏ స్థానం ఎవరికి వెళ్తుందో తెలీని తరుణంలో వలస వచ్చిన రేవంత్ వర్గానికి న్యాయం జరుగుతుందా అన్నది ప్రశ్నార్ధకమే. ఒకవేళ వీళ్ళకు అవకాశం ఇస్తే పార్టీ లో ముందు నుండీ ఉన్న సీనియర్లు ఊరుకునే పరిస్థితి లేదు. అసలు రేవంత్ వర్గం పరిస్థితి ఏమవుతుందో అన్నది ప్రస్తుతానికయితే డైలమానే .

Related News