Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోహన్ బాబు జగన్ ను కలిసింది అందుకేనా ?

Category : politics



సినీ నటుడు మోహన్ బాబు జగన్ ను కలవటం రాజకీయ చర్చకు కారణం అయ్యింది. జగన్ పై దాడి జరిగిన నేపధ్యంలో జగన్ గురించి కత్తి దాడి జరిగిన తర్వాత కూడా చిరునవ్వు వీడని నాయకుడు అని పాజిటివ్ గా మాట్లాడిన మోహన్ బాబు ఇప్పుడు జగన్ ను కలవటం రాజకీయాల్లో మంచు ఫ్యామిలీ క్రియాశీల పాత్ర పోషించటానికే అని చర్చ జరుగుతుంది. అసలు జగన్ తో మోహన్ బాబు ఏం మాట్లాడారు అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


1995 నుంచి 2001 వ‌ర‌కూ రాజ్య‌స‌భ సభ్యునిగా పని చేసిన ఆయన క్రియాశీల రాజకీయాల్లో లేరు. కానీ ప్రస్తుతం రాజకీయాలవైపు మోహన్ బాబు ఆసక్తి చూపిస్తున్నారా అంటే తాజా పరిణామాల వల్ల అవును అని చెప్పకతప్పదు. మరోపక్క ఆయన చిన్న కుమారుడు మనోజ్ రాజకీయాల వైపు ఆసక్తి చూపటం కూడా అందుకు ఊతమిస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న మోహన్ బాబు ఇప్పుడు జగన్ కుటుంబానికి దగ్గర అవుతున్నారు.

మోహన్ బాబు కుమారుడు విష్ణు జగన్ సోదరిని పెళ్లి చేసుకోవటంతో జగన్ కుటుంబానికి దగ్గరయ్యారు. వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవల వైఎస్ ఫ్యామిలీతో చాలా చనువుగా ఉంటున్న మోహన్ బాబు జగన్ మీద జరిగిన కత్తి దాడి ఘటనలో కూడా జగన్ పక్షం తీసుకుని స్పందించారు. దీంతో వైసీపీ తో రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నం జరుగుతున్నట్టు భావిస్తున్నారు.
చంద్రబాబుకు మంచు ఫ్యామిలీ స‌పోర్ట్ ఉంటుందా అంటే అనుమాన‌మే అనే భావన కలుగుతున్న తరుణంలో తాజాగా జగన్ ను పరామర్శించటానికి మోహన్ బాబు జగన్ ఇంటికి వెళ్ళారు. జ‌గ‌న్ కు పాజిటివ్ గా మోహ‌న్ బాబు స్పందించిన తీరు, జగన్ ఇంటికి వెళ్లి పరామర్శించిన తీరు అటుంచితే పరామర్శ పేరుతో రాజకీయాల గురించి సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తుంది. వారి కలయికతో ఆయ‌న పొలిటిక‌ల్ ఎంట్రీ షురూ అని అంటున్నారు.


మంచు ఫ్యామిలీలో ఇప్పుడు విష్ణుకు, లక్ష్మికి రాజ‌కీయాల‌పై ఆస‌క్తి లేదు మ‌నోజ్ ఒక్కడే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు.దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి మనోజ్ చూస్తున్నారు అని తెలుస్తుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో శ్రీకాళహస్తి నుండి పోటీ చెయ్యాలనే ఆలోచనలో ఉన్న మనోజ్ కోసం మోహన్ బాబు వైసీపీ అధినేత జగన్ తో సీక్రెట్ గా మాట్లాడారా అన్నది తెలియాల్సి వుంది. కాని అక్క‌డ మ‌ధు ఉన్నాడు కాబట్టి ఆయన్ని కాదని టికెట్ ఇచ్చే అవకాశం లేదన్నది ఒక టాక్. మరి ఇంతకీ వారి మధ్య జరిగిన చర్చ సారాంశం ఏంటో అన్నది మాత్రం ఇప్పుడు క్యూరియాసిటీ కి కారణం అవుతుంది. త్వరలో మంచు ఫ్యామిలీ మెంబర్ రాజకీయ ఆరంగేట్రం చేస్తారనే వార్తలు వస్తున్న నేపధ్యంలో మోహన్ బాబు జగన్ ను కలవటం వెనుక పెద్ద ఆలోచనే ఉంది అన్న భావన రాజకీయ నేతలకు కలుగుతుంది.