//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ‌బ‌రిమ‌ల స‌న్నిధానంలోకి మ‌హిళ‌లు ఎందుకు వెళ్ల కూడ‌దో తెలుసా..?

Category : national

శ‌బ‌రిమ‌ల స‌న్నిధానంలోకి మ‌హిళ‌లు ఎందుకు వెళ్ల కూడ‌దు..? వెళ్ల‌కూడ‌ద‌ని చెప్ప‌డానికి కార‌ణాలు ఏమైనా ఉన్నాయా..? గ‌తంలో అనుమ‌తి ఇచ్చి.. ఆ త‌రువాత నిషేధించ‌డానికి కార‌ణాలు ఉన్నాయా..? ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికీ స‌మాధానం దేవ ప్ర‌శ్నం. స‌క్లిష్ట ప‌రిస్థితులు ఎదురైన‌ప్పుడు ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ప‌రిస్థితులు మారిన‌ప్పుడు ఇక మ‌నం కాదు. ఆ దేవుడే చెప్పాలి అని భావించిన‌ప్పుడు త‌ట్టే ఆధ్యాత్మిక ప‌రిష్కారం దేవ ప్ర‌శ్నం. మ‌నం చేసే పూజ‌లు, కైంకర్యాల‌లో లోపాలు ఉన్నాయా..? తెలిసో.. తెలియ‌కో త‌ప్పులు చేస్తున్నామా..? చేస్తే ఎక్క‌డ‌..? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌ను నేరుగా భ‌గ‌వంతుడ్ని అడ‌గ‌డ‌మే దేశ‌ప్ర‌శ్నం.

ద‌క్షిణాది ఆల‌య సంప్ర‌దాయాల్లో త‌ర‌చుగా కేర‌ళ‌లో స‌హ‌జంగా క‌నిపించే క్ర‌తువు ఇది. ఒక ప్ర‌ధాన అర్చ‌కుడు. 11 మంది ఆచార్యులు క‌లిసి ఈ తంతును న‌డిపిస్తారు. దేవుడిని ప్ర‌శ్నించ‌డానికి తిధి, న‌క్షత్రాలను బ‌ట్టి ముందుగా ముహూర్తాన్ని నిర్ణ‌యిస్తారు. ఆ రోజున స్వామి వారికి ప్ర‌త్యేక పూజ‌లు, హోమాలు చేస్తారు. ఒక చెక్క‌పైనో.. నేల‌పైనో 12 అడుగుల‌తో ఓ ముగ్గును వేస్తారు. జ్యోతిష్యుడు, ప్ర‌ధాన అర్చ‌కుడు గ‌వ్వ‌ల‌ను చేతిలో ప‌ట్టుకుని.. వాటిని స‌రి చేస్తుంటారు.

అదే స‌మ‌యంలో ఆడ, మగ ఎవ‌రైనా స‌రే చిన్న పిల్ల‌ల‌ను దేవుడిగా భావించి వాళ్ల చేతుల్లో బంగారు నాణెం ఉంచుతారు. ప్ర‌శ్న‌లు వేస్తుండ‌గా, ఆ పిల్ల‌లు ఆ నాణేన్నా ఏదో ఒక గ‌దిలో ఉంచుతారు. ఆ స‌మ‌యంలో గ‌వ్వ‌ల‌ను కూడా విసిరి ఆ గ‌ది, ఈ గ‌వ్వ‌ల‌ను ప్రామాణికంగా తీసుకుని దేవుడు ఓ స‌మాధానం ఇచ్చిన‌ట్టుగా అంచ‌నాకు వ‌స్తారు. దేవుడు సమాధానం చెబుతాడా..? అంటే చెబుతాడ‌న్న‌దే విశ్వాసం.

ఎందుకంటే..? మ‌నం పూచించే విగ్ర‌హాల‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేస్తాం. ప్రాణం ఉన్న‌ట్టుగా భావించే దేవుడు స‌మాధానం ఎందుకు ఇవ్వ‌డు అన్న‌దే ఇక్క‌డ వినిపించే లాజిక్‌. అయితే, శ‌బ‌రిమ‌ల‌లో క్ర‌తువులు స‌జావుగా సాగుతున్నాయా..? అయ్య‌ప్ప సంతోషిస్తున్నాడా..? స‌ంతృప్తి చెందుతున్నాడా..? అని దేవ ప్ర‌శ్నం వేసిన‌ప్పుడు నో అనే సమాధానం వ‌చ్చింద‌ట‌. ప్ర‌త్యేకించి మ‌హిళ‌ల అనుమ‌తిని స్వ‌యంగా స్వామివారే నిరాక‌రించార‌ని చెబుతారు.

ఇక మ‌రోకార‌ణం, అయ్య‌ప్ప.. రాముడు, కృష్ణుడు త‌ర‌హాలో ఈ భూమిపై న‌డిచిన వ్య‌క్తి. త‌న‌కు తానుగా నైశ్చిక బ్ర‌హ్మ‌చ‌ర్యాన్ని తీసుకున్న‌ట్టు త‌న తండ్రికి స్వ‌యంగా చెప్పాడు. ఇప్ప‌టికీ ఆ రాజ వంశం శ‌బ‌రిమ‌ల‌లో ఉంది. పైగా, మ‌హిళ‌ల‌ను పూర్తిగా అనుమ‌తించ‌డం లేదు. ఉన్న‌వి కేవ‌ల కొంత మేర ష‌ర‌తులు మాత్ర‌మే అంటున్నారు సేవ్ శ‌బ‌రిమ‌ల ప్ర‌తినిధులు.