//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రష్మిక పెళ్లి క్యాన్సిల్ కి కారణం ఎవరో తెలుసా.... !

Category : movies

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మికకు తెలుగులో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. కిరాక్ పార్టీ సినిమాతో కన్నడలో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మిక తెలుగులో ఛలో, గీతా గోవిందం సినిమాలతో సూపర్ హిట్లు అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో టాలీవుడ్ బిజీ హీరోయిన్ గా మారిన రష్మికకు ఆల్రెడీ కన్నడ నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.

తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక ఇప్పుడప్పుడే పెళ్లి వద్దనుకుంది. అంతేకాదు తెలుగులో స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత కెరియర్ మీద ఆసక్తి పెంచుకున్న రష్మిక రక్షిత్ శెట్టితో పెళ్లి వాయిదా వేసుకోవాలని అనుకుందట. అయితే ఈ ఇద్దరి మధ్య రష్మిక మేనేజర్ గొడవలకు కారణమయ్యాడట.

తెలుగులో ఛలో, గీతా గోవిందం రెండు సినిమాలు రక్షిత్ ఆమోదంతోనే చేసిందట. వరుస ఆఫర్లు వస్తుండటంతో రక్షిత్ తెలుగులో రష్మికకు ఓ మేనేజర్ ను పెట్టాడట. అతని వల్ల రక్షిత్, రష్మికల మధ్య గొడవలు మొదలయ్యాయట.

అతను మంచి సినిమా అవకాశాలను కూడా రష్మికకు రాకుండా చేశాడట. దీనితో రక్షిత్ కు చెప్పకుండానే రష్మిక ఆ మేనేజర్ ను మార్చేసిందట. దీనితో రక్షిత్ కూడా హర్ట్ అయ్యాడట. ఫైనల్ గా రక్షిత్, రష్మికల పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడప్పుడే ఇక పెళ్లన్న మాట లేదని చెబుతున్నాడు రష్మిక తండ్రి సుమన్. మొత్తానికి ఒక సినిమాతో మొదలైన వీరి ప్రేమ రెండు సినిమాల తర్వాత ఎండ్ కార్డ్ పడేలా చేసుకుంది.

#Rashmikamandanna #Rashmika #tollywoodheroine #Rashmikamarriage