//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చేగువేరా ని యువత ఎందుకు అంతలా ఫాలో అవుతారో తెలుసా .....!

Category : world national

తలపై ఒక టోపీ, ఆ టోపి పై ఒక నక్షత్రం... పొడవుగా ఉండే జుట్టు, అన్నింటికీ మించి ఒక అద్భుతమైన తేజస్సు తో వెలిగిపోయే మొఖం . ఎటువంటి భయం లేకుండా సూటిగా చూసే కళ్ళు . ఏదో ఒక సమయంలో మనం ఇటువంటి ఒక రూపాన్ని చూసి ఉంటాం . టి షర్ట్ లు, బైక్ లు , పోస్టర్స్ లపై ఎక్కడ చూసినా ఇతని రూపమే కనిపిస్తుంది . సినిమా హీరోల కన్నా , క్రీడాకారుల కన్నా , ఇతనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు .

ఎక్కువగా యువత ఇతనిని అభిమానిస్తున్నారు అంటే అంతలా ఆయన ఏం చేశాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం . ఈయనని ఏదో ఒక మారుమూల ప్రాంతమో లేక ఒక సిటీ లో ఉండే యువత మాత్రమే ఫాలో అవ్వరు, యావత్ ప్రపంచం లో ఉండే యువత మొత్తం ఆయన్ని ఫాలో అవుతారు . ఈయన ఫోటో చూసిన ప్రతి ఒక్కరికి తెలియకుండానే కొంచెం గర్వం, స్ఫూర్తి వస్తుంది ...ఈయన మరెవరో కాదు మన చేగువేరా . ఇంతమంది ఇంతలా ఆరాధిస్తున్నారు అంటే ఈయన ఏదో కచ్చితంగా సాధించి ఉండాలి ఒక ఉద్యమకారుడిగా, ఒక రచయితగా, ఒక డాక్టర్ గా ఆయన జీవితం ఎలా సాగిందో , అలాగే అమెరికా ప్రభుత్వం, కొంతమంది నియంతలు కలిసి ఆయనను ఎలా మట్టు, పెట్టారో ప్రపంచవ్యాప్తంగా యువత ఆయనని ఎందుకు ఫాలో అవుతారో ఇప్పుడు చూద్దాం .

చేగువేరా అసలు పేరు ఎర్నెస్టో రాఫెల్ గురువే డేరాల సరేనా ఈయన జూన్ 14 1928లో అర్జెంటీనాలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు . ఆయన కి చిన్నతనంలోనే ఆస్తమా ఉండటంవల్ల ఊపిరి తీసుకునేందుకు ఆయన కొంచెం ఇబ్బంది పడే వాడు . చేగువేరా మొదటగా ఇంజనీరింగ్ లో చేరి అది నచ్చక ఆ తర్వాత మెడిసిన్ లో జాయిన్ అయ్యాడు . ఆ తర్వాత లాటిన్ అమెరికా మొత్తం ఒకసారి పర్యటించాలని నిర్ణయించుకున్నాడు . 1952లో తన స్నేహితుడితో ఒక స్కూటర్ పై లాటిన్ అమెరికా మొత్తం పర్యటించడానికి బయలుదేరి వెళ్లారు , ఇలా వారు ప్రయాణించిన కాలమే వారి జీవితంలో ఊహించని మలుపులు తెచ్చిపెట్టింది . లాటిన్ అమెరికాలోని గ్రామాలన్నీ కూడా కటిక పేదరికంలో ఉండేవి ఉత్తర అమెరికాలోని కొంతమంది బడా వ్యాపారులు ఈ లాటిన్ అమెరికాలోని గనుల లో ఉండే అఖండ సంపదని దోచుకుని అక్కడ కొన్ని ఫ్యాక్టరీల నిర్మించి ఆ ఫ్యాక్టరీలలో, అక్కడి గ్రామాల్లో ఉండే పేద ప్రజలను కూలీలుగా నియమించి వారి కష్టాన్ని దోచుకునేవారు .

అలా లాటిన్ అమెరికా పర్యటనలో ఉన్న చేగువేరా ఇక్కడ జరిగే ఈ దారుణాన్ని చూసి చలించిపోయాడు. ఎలాగైనా వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నిశ్చయించుకున్నాడు . తొమ్మిది నెలల పాటు లాటిన్ అమెరికా మొత్తం పర్యటించి వెనక్కి వచ్చారు . 1953లో చేగువేరా తన మెడిసిన్ పూర్తి చేశాడు . ఆయన మొదటి నుండి విప్లవకారులు అనుకరిస్తూ వచ్చేవాడు అందుకేనేమో లాటిన్ అమెరికాలో దోచుకుంటున్న వారిని ఎదుర్కోవాలంటే తన మెడిసిన్ చదువు మాత్రమే పనికి రాదని విప్లవం ఒక్కటే దారి తెలుసుకున్నాడు . అతను చేయాలనుకున్న దాని గురించి వారి తల్లిదండ్రులకు చెప్పి లిబియాలో తన విప్లవం ప్రారంభించాలని అనుకున్నాడు కానీ అక్కడ నాయకత్వ లక్షణాలు లేకపోవడం వల్ల ఇంకో స్థావరానికి చేరుకున్నాడు . అక్కడ ఎంతో మంది విప్లవ నాయకులతో చేతులు కలిపి వారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు . అక్కడే హెల్డా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఆ తర్వాత కొంతకాలానికి వారిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు . ఆ తర్వాత మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చేగువేరా . ఆ తరువాత క్యాస్ట్రో తో స్నేహం చేసి ,క్యాస్ట్రో తో కలిసి చేగువేరా క్యూబా చేరుకున్న తర్వాత వీరికి ప్రభుత్వానికి మధ్య విపరీతమైన యుద్ధం జరిగాయి . ఈ యుద్ధంలో అమెరికా కలుగజేసుకొని వీరిద్దరికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వానికి సహాయం చేసేది ఆ విప్లవం జరుగుతున్న సమయంలోనే పేదలని మోసం చేస్తున్న వారిని వెతికి వెతికి చంపేవాడు .

అందుకే దోపిడీదారులకు చేగువేరా వస్తున్నాడంటే గుండెల్లో వణుకు పుట్టేది ఆయనని ఎదురుగా వచ్చి ఎదుర్కొనే దమ్ము లేక పిరికి పందుల వలె చాటుగా వచ్చి ఆయనను పట్టుకొని జైల్లో బంధించారు . అయినా కూడా చేగువేరా కళ్ళలో కాసింత కూడా భయం అనేది కనిపించలేదు . దీనితో అక్కడ ఉండే సైనికులు చేగువేరా శరీరం లోకి 9 బుల్లెట్స్ దింపారు . దీనితో చేగువేరా అక్కడే కుప్పకూలిపోయాడు . ఆతరువాత అయన శవాన్ని కూడా ఎవరికీ తెలియకుండా పాతిపెట్టేశారు . చేగువేరా చెప్పే ఒకే ఒక మాట...... ఒకరికి కాలికింద బానిసలా నీచంగా బ్రతికే బదులు..... లేచి నిలబడి ప్రాణం విడిచి పెట్టడం మేలు , ఇదే మాట చాలా మంది యువత లో స్ఫూర్తిని నింపింది .