//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాబా రాందేవ్ `ప్రైవేట్ ఆర్మీ' ఎవ్వరి కోసం !

Category : national


ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో తన పతంజలి వ్యాపార సామ్రాజ్యాన్ని పలు రేట్లు పెంచుకొంటున్న యోగా గురు రాందేవ్ బాబా కొత్తగా "ప‌రాక్ర‌మ్ సుర‌క్ష ప్రైవేట్ లిమిటెడ్" పేరుతో ఓ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ‌ను ప్రారంభించడం ఆసక్తి కలిగిస్తున్నది. దీనిని ఒక వ్యాపార ప్రక్రియగా ప్రారంభించారా, భవిష్యత్  లో తన వ్యాపార సామ్రాజ్యానికి రక్షణగా ఉండేందుకు `ప్రైవేట్ ఆర్మీ' గా ప్రారంభించారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఇప్ప‌టికే పతంజ‌లి సంస్థ‌తో రాందేవ్ దేశంలోని అత్యంత ధ‌న‌వంతుల్లో 25వ స్థానానికి చేరుకున్నారు. ప్ర‌స్తుతం రాందేవ్ బాబా సంప‌ద విలువ రూ.25,600 కోట్ల‌కు చేరింది. `పరాక్రమ్' ద్వారా 25 వేలు నుండి 50 వేల  మంది వరకు ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో హింస, విద్వేష చర్యలకు పాల్పడుతున్న గోరక్షకులు అనేకమందికి ఈ విధంగా ఉపాధి కల్పిస్తారా ?

22 నుండి 40 ఏళ్ళ మధ్య వయస్సు గల యువకులను చేర్చుకొని వారికి మాజీ  సైనిక, పోలీస్ అధికారులతో కఠినమైన శిక్షణ ఇప్పించనున్నారు. ప్రస్తుతం యువకులకు పరిమితమైనా భవిష్యత్ లో యువతులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం బాబా రాందేవ్ కు ప్రభుత్వం జడ్ క్యాటగిరి భద్రత కల్పిస్తున్నది. అయినా అభద్రతా భావం ఎదుర్కొంటున్నారు. 

బీజేపీ ప్రభుత్వాలు పోతే ఈ భద్రత  కొనసాగే అవకాశం ఉండదు. అందుకనే భవిష్యత్ లో తన వ్యాపార సామ్రాజ్యం కాపాడుట కోసమే ఈ `ప్రైవేట్ ఆర్మీ' ని ఏర్పాటు చేసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. 

మూడేళ్ళ మోదీ హయాంలో పతంజలి వ్యాపారం మూడు, నాలుగు రేట్లు పెరిగి రూ 10,500 కోట్లకు చేరుకొంది. వచ్చే ఐదేళ్లల్లో పది రేట్లు  పెంచు కోవాలని భావిస్తున్నారు. బీజేపీ అధికారమలో ఉన్న ప్రతి రాష్ట్రంలో విలువైన వందలాది ఎకరాల భూములను కారు చవకగా పొందుతున్నారు. గత ప్రభుత్వాలు భూఆక్రమణ, వ్యాపార అక్రమాలకు సంబంధించి నమోదు చేసిన వందలాది కేసులను బిజెపి ప్రభుత్వాలు రద్దు చేశాయి. 

నేపాల్ ప్రభుత్వం పలు పతంజలి ఉత్పత్తులను నాసిరకంగా ఉన్నాయని నిషేదించింది. రక్షణ శాఖ కూడా నిషేధాలు విధించింది. కానీ దేశంలో ఎక్కడ పతంజలి ఉత్పత్తులపై ఎటువంటి చర్యలు ఉండటం లేదు. ఈ రాజభోగం ఎంతోకాలం జరుగదని, బీజేపీ అధికారం కోలిపోతే తన వ్యాపార సామ్రాజ్యం కాపాడుకోవడం కష్టమనే ముందు చూపుతో ఈ `ప్రైవేట్ ఆర్మీ' ని ఏర్పరచుకున్నట్లు స్పష్టం అవుతున్నది.