//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కేరళలోని ఆ ఆలయంలో పురుషులు స్త్రీలుగా మారతారు!

Category : national

కేరళను మలబార్ తీరాం అంటారు. దీనికి తూర్పు, ఈశాన్య దిక్కులో కర్ణాటక, తమిళనాడు, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. దక్షిణ భారతంలోని నాలుగు రాష్ట్రాలలో కేరళ ఒకటి. క్రీ.పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యంలోనూ భాగంగా ఉండేది. తర్వాత కాలంలో చేర సామ్రాజ్యం, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంది. విదేశాలతో ఏర్పరచుకున్న సంబంధాలు చివరకు స్థానికులకు, వలసదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి - ఈ రెండు పదాల ప్రకారం కొబ్బరి చెట్ల భూమిగా కేరళం అయిందనేది ఒక వాదన.

ఆయుర్వేదానికి, పర్యటకానికి ప్రసిద్ధి గాంచిన కేరళలో అనేక దేవాలయాలు, నిర్మల సరస్సులు, సముద్ర ప్రాంతాలు, కాలువలు, ద్వీపాలు, మొదలైన ఆకర్షణలు ఎన్నో ఉంటాయి. నేషనల్ జియోగ్రాఫిక్ అండ్ ట్రావెల్ ప్లస్ లీజర్ సంస్ధ మేగజైన్ ట్రావెలర్.. కేరళను ప్రపంచంలోని పది భూతల స్వర్గాలలో ఒకటిగానూ, జీవితంలో చూడాల్సిన 50 పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా, 21వ శతాబ్దంలోని 100 అతి గొప్ప పర్యటనలలో ఒకటిగానూ పేర్కొంది.

అయితే కేరళలోని ఓ ఆలయంలో మాత్రం పురుషులు కూడా స్త్రీల మాదిరిగా అలంకరించుకుంటారు. ఒంటి నిండా నగలతో అచ్చం పెళ్లి కూతురిలా ముస్తాబవుతారు. ఆలయంలో దీపాలు వెలిగించి ఆరాధన చేస్తారు. ఇదే కొల్లం జిల్లాలోని కొట్టన్కులంగర దేవి ఆలయం. ఇక్కడ మగవారు స్త్రీ రూపంలో అలంకరించుకుని అన్ని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇలా అలంకరించుకోడానికి గుడి ప్రాంగణంలో ప్రత్యేకమైన గదులు కూడా ఉన్నాయి.

విద్య, ఉద్యోగం, ఆరోగ్యం,పెళ్లి ఇలా పలు సమస్యలపై అమ్మవారిని వేడుకుంటారు. ఈ ఆచారం వెనుక కొన్ని కథనాలు ఉన్నాయి. ఒకసారి కొందరు పశువుల కాపరులు చీరలు ధరించి దగ్గరలోని ఒక రాయికి పూజలు చేశారు. అప్పుడు రాయిలో దైవశక్తిని వారు గమనించారు. తర్వాతి కాలంలో ఆ రాయిని కొట్టన్ అని పిలిచి చుట్టూ ఒక గుడిని కూడా కట్టారు. అప్పటి నుంచే పూజలు చేయడానికి మగవారు స్త్రీలుగా అలంకరించుకోవడం జరుగుతోంది. కొబ్బరికాయను ఆ రాయికేసి కొట్టడంతో దాన్ని నుంచి రక్తం వచ్చిందట. దీంతో ప్రజలు ఆ రాయికి అతీతశక్తులు ఉన్నాయని భావించి పూజలు చేయటం ప్రారంభించారు. అలాగే రాయి పరిమాణం కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండటం అక్కడ మరో విశేషంగా చెపుతుంటారు భక్తులు.

Related News