//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాహుల్ గాంధీ పై యువతుల క్రేజ్ ఎంతో తెలుసా .. ఆ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది

Category : politics state

యువతుల్లో రాహుల్ గాంధీ పైన ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో విద్యార్థులతో రాహుల్ గాంధీ చేసిన ముఖాముఖితో అర్థమైంది. రాహుల్ రాక కోసం భారీగా తరలివచ్చిన యువతులు రాహుల్ గాంధీని చూడడాన్ని చాలా ఎగ్జైట్ మెంట్ గా ఫీల్ అయ్యారు. రాహుల్ గాంధీ రాక కోసం ఎదురు చూడ్డం తన వల్ల కావడం లేదంటూ ఒక విద్యార్థిని చేసిన వీడియో ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం యువతుల్లో రాహుల్ గాంధీకి ఉన్న క్రేజ్ ను తెలియజేయడం కోసం వరకు వణక్కం రాహుల్ గాంధీ హ్యాష్ ట్యాగ్ దించేసింది. ఈ హ్యాష్ టాగ్ కు కూడా విపరీతమైన స్పందన వచ్చింది.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్నికల నగారాను మోగించిన ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన చాలా ఆసక్తికరంగా సాగింది. చెన్నై లోని స్టెల్లా మేరీస్ కాలేజీలో విద్యార్థులతో ముఖాముఖి లో పాల్గొన్న రాహుల్ గాంధీ వారితో చాలా సరదాగా మాట్లాడారు. సార్ అని పిలవద్దు రాహుల్ అనండి చాలు అంటూ విద్యార్థులతో ఫ్రెండ్లీగా సంభాషించారు. రాహుల్ రాకకు చాలా ముందుగానే అక్కడికి వచ్చి కూర్చున్న యువతులు... రాహుల్ రాక కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూడటం కనిపించింది. రాహుల్ పట్ల ఏ మేర ఆసక్తి ఉందన్న విషయాన్ని తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ తమిళనాడు శాఖ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో *వణక్కమ్ రాహుల్ గాంధీ* అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ను పెట్టింది. ఈ హ్యాష్ ట్యాగ్ తమిళనాడు యువతులను బాగానే ఆకట్టుకుంది.

రాహుల్ ను చూసేందుకు నేరుగా సమావేశానికి వచ్చేసిన యువతులు ఆయన రాకకోసం వేచి చూస్తున్న క్రమంలో ఓ యువతి మరింత ఎగ్జైట్ మెంట్ కు గురై... రాహుల్ కోసం వేచి చూడటం కూడా తనతో కావడం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ఈ చిన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ పోస్ట్ చేసింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే... తన కోసం అమ్మాయిలంతా వేయి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటే... రాహుల్ కూడా వారి ఎగ్జైట్ మెంట్ ను ఏమాత్రం నిరాశ నిరాశపరచకుండా లాల్చీ పైజామాను వదిలేసి ఏకంగా కాలేజీ కుర్రాడిలా జీన్స్, టీ షర్ట్ లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తన కోసం ఎదరు చూస్తున్న యువతులను ఆయన అదే ఎగ్జైట్ మెంట్ లో ఉండేలా చేశారు. ఇక వారితో సెల్ఫీ లు దిగుతూ హల్ చల్ చేశారు.