Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎవరి కొడుకైతే ఏంటి? బీజేపీ ఎమ్మెల్యే ఫైన ఫైర్ అయిన మోదీ

Category : politics

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆకాశ్ వ్యవహారంపై ప్రధాని తీవ్రంగా స్పందించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్‌వర్గీయ ఓ మున్సిపల్ అధికారిపై క్రికెట్ బ్యాటుతో దాడి చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నేత ఎవరి కుమారుడైనప్పటికీ తాను అలాంటి చర్యలను ‘‘అంగీకరించబోనని’’ ఆయన పేర్కొన్నారు. ఆకాశ్ వ్యవహారంపై ప్రధాని తీవ్రంగా స్పందించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్-3 ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆకాశ్, బీజేపీ సీనియర్ నేత కైలాశ్ విజయ్‌వర్గీయ కుమారుడు. ఇటీవల కాలంలో అధికారులు ఓ ఇంటి నిర్మాణాన్ని కూల్చుతుండగా ఆకాశ్ క్రికెట్ బ్యాటుతో దాడి చేసిన ఓ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ కేసులో అరెస్టైన ఆకాశ్.. ఆదివారం జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ స్థానిక నేతలు ఆయనకు పూలమాలలు వేసి, పార్టీ ఆఫీసు వద్ద గాల్లోకి కాల్పులు జరపారు. ఈ పనులపైనా ప్రధాని నరేంద్ర మోదీ ఫైర్ అయ్యారు. ఈ సంగటనఫై ఆకాశ్ విజయ్‌వర్గీయ ప్రవర్తించిన తీరును ప్రధాని మోదీ తప్పుబట్టారు.

ఆకాశ్ జైలు నుంచి బయటికి రావడాన్ని స్వాగతించిన స్థానిక బీజేపీ విభాగాన్ని వెంటనే రద్దు చేయాలంటూ ప్రధాని ఆదేశించారని బీజేపీ సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. అలాంటి నేతలను పార్టీ నుంచి బహిష్కరించాలని కూడా ప్రధాని పేర్కొన్నారన్నారు. ‘‘ఈ వ్యవహారంపై పూర్తి విచారణ చేపట్టాలి. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తున్న వారిని కూడా ప్రశ్నించాలి. పార్టీ ఎంపీలంతా బాధ్యతాయుతంగా, సహృదయంతో వ్యవహరించండి...’’ అని ప్రధాని ఆదేశించినట్టుగా బీజేపీ వర్గాలు తెలిపాయి. పార్టీ ఎంపీలంతా పార్లమెంటులో పూర్తి సమయం ఉండాలనీ.. సామాన్యుల సమస్యలను లేవనెత్తాలని కూడా ప్రధాని హెచ్చరించినట్టు సమాచారం.

Related News