//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రెసిడెంట్ గారు ఎవరు?

Category : editorial politics

యూపీ అసెంబ్లీని బీజేపీ గద్దలా తన్నుకుపోయింది.ఉత్తరాఖండ్ లో అధికారాన్ని కమలదళం హస్తం నుండి హస్తగతం చేసేసుకుంది.మణిపూర్ అసెంబ్లీల్లో బీజేపీ బలం బాగా పుంజుకోనుంది.రాష్ట్రపతి ఎల్లక్షన్స్ కి ఈ రెండు కీలకమే లోక్ సభతోపాటు రాజ్యసభ,రాష్ట్ర అసెంబ్లీల సభ్యులందరు కలసి ప్రెసిడెంట్ అఫ్ ఇండియాని ఎన్నికుంటారు.పార్లమెంట్ లో 776 మంది ఎంపీలు,అసెంబ్లీల్లో 4,120 మంది శాసనసభ్యులు ఉండగా వారి ఎలక్ట్రోరల్ ఓట్ల విలువ దాదాపు 11 లక్షలు.అందులో సగం అంటే సుమారు ఐదున్నర లక్షలు ఎలక్ట్రోరల్ ఓట్లు గెలుచుకున్నవారే ప్రెసిడెంట్ పీఠం ఎక్కుతారు.ఈ ప్రెసిడెంట్ పీఠంఫై ఎవరి సహాయం,సపోర్ట్ అవసరం లేకుండా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని బీజేపీ ఎన్నాళ్ళనుండో కలలుగంటున్నది.చివరికి ఆ తరుణం యూపీలో విజయం కారణంగా బీజేపీ తలుపు తట్టింది.ఎదో చిన్న చితక అవసరమైన తమిళనాడులోని అన్నాడిఎంకె,ఒరిస్సాలోని బిజెడివాళ్ళు NDA కి సపోర్ట్ ఇస్తారు కాబట్టి ఆ విషయంలోనూ ఇప్పుడు బీజేపీకి ఢోకాలేదు.అయితే ప్రెసిడెంట్ గా ఎవర్ని ఆ పీఠంపై మోదీ కూర్చుబెడతారన్నదే చూడాలి.

అందరు అనుకుంటున్నట్టు LK అద్వానికి పట్టంకట్టనున్నారా లేక మరెవరినైనా ఎంపిక చేస్తారా ?చూడాలి దేశ ప్రధాని కావాలనుకున్న అద్వానీ కలలకు గండికొట్టి మోదీ తెరపైకి రావటం లోలోపల ఎక్కడో బాధపెట్టిన,పైకి మాత్రం అద్వానీ గంభిరంగానే ఉండేవారు.ఒక్కోసారి అగ్నిపర్వతం బద్దలైనట్టు మోదీ ప్రభుత్వాన్ని విమర్శించినా తర్వాతే శాంతించేవారు.ప్రజలు మోదీని కోరుకోవటంతో,పార్టీలో నేతలు కూడా మోదీకే ఎక్కవ సపోర్ట్ చేయటంతో అద్వానీ మిన్నకుండిపోయారు.ప్రధాని పీఠం ఇక తనకు ఎన్నడూ అందని ఎండమావే అని ఆయన అభిప్రాయానికి రావటంతో పెద్దగా సమస్య లేకుండా పోయింది.అయితే ఇప్పడు మోదీ ఇచ్చే రాష్ట్రపతి పీఠాన్ని ఆయన స్వీకరిస్తారా ?లేదా అనేది సందేహమే అయితే అది ఒకరు ఇచ్చేది కాదు.మొత్తం పార్టీ వారు కలసి తీసుకొనే నిర్ణయం కాబట్టి అద్వానీ గౌరవించి తీరాలి.

ప్రణుబ్ ముఖర్జీ లాంటి వ్యక్తిని మరో మారు ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న బాగానే ఉంటుందికాని,అంత హుందాతనం కలిగిన వ్యక్తులు బీజేపిలోను పోగుబడి ఉన్నారు కాబట్టి అది సాధ్యం అయ్యే అవకాశం లేదు.అప్పట్లో బీజేపీ బలపరిచిన కలామ్ ని రెండోసారి ఎన్నుకుందాం అంటే హస్తం వారు ససేమిరా అన్నారు.ఆ మహానుభావుడ్ని కాదని ఎవరో అనామకులకు దేశ అత్యున్నత పదవిని కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ వారికుంది.అలాంటి వారికి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఈ పార్టీ సపోర్ట్ చేయదు,బీజేపీ అసలే చేయదు.ఎంతో కాలం నుండి ప్రెసిడెంట్ పదవి ఆకలితో ఆ పార్టీ నకనకలాడుతోంది,కాబట్టి బీజేపీ కురువృద్ధుడే ప్రెసిడెంట్ అయ్యే అవకాశం నూరు శాతం ఖాయం.

Related News