Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజమండ్రిలో త్రిముఖ పోరు ..గెలుపెవరిదో ?

Category : state politics

రాజమండ్రి లోక్ సభ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. రాజమండ్రి రాజకీయాలు అంటేనే చాలా కాస్ట్లీ అనే పరిస్థితి ఉంటుంది. ఆర్థికంగా చాలా బలమైన ప్రాంతం.. వాణిజ్య కేంద్రం కావడంతో ఈ సీటు కోసం బడాబడా బాబులు పోటీపడుతుంటారు. ఈసారి కూడా అంతే పోటీ నెలకొంది. కానీ అనూహ్యంగా కొత్త అభ్యర్థులు రాజమండ్రి బరిలో నిలిచారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప టీడీపీ అభ్యర్థిగా కొత్తగా తెరపైకి వచ్చింది. ఇక వైసీపీ అనూహ్యం రాజమండ్రిపై బీసీ కార్డును ప్రయోగించింది. సామాజిక ఎత్తుగడను వేసింది. మార్గాని భరత్ వైసీపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. ఇక కాపు సామాజికవర్గాన్ని బేస్ చేసుకొని బలమైన ఆకుల సత్యనారాయణను జనసేన బరిలోకి దింపింది. ఈ ముక్కోణపు పోటీలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.టీడీపీ తరపున 2014లో నటుడు - నిర్మాత మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా గెలిచారు. వైసీపీ అభ్యర్థి బొడ్డు వెంకటరమణ చౌదరిపై లక్షా 80వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు.

ఐదేళ్లు ఎంపీగా కొనసాగిన మురళీ మోహన్ ఎందుకోగానీ మరోసారి ఎంపీగా పోటీచేయనని ప్రకటించారు.కానీ చంద్రబాబు ఊరుకోకుండా ఆయన కోడలు రూపను రాజమండ్రి ఎంపీ బరిలో నిలిపారు. రూప మామ మురళీ మోహన్ అస్వస్థతకు గురైనప్పుడు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. కార్యకర్తలు - నేతలకు అందుబాటులో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆమెకు ఇదే కలిసివస్తుందని భావిస్తున్నారు.మాగంటి రూప కమ్మ సామాజికవర్గం. ఆమెకు పోటీగా ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మార్గాని భరత్ ను దించింది. రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో అశేషంగా ఉన్న బీసీల ఓట్లు సాధించేందుకు వైసీపీ ఎత్తుగడ వేసింది. వీరంతా మార్గాని భరత్ వెంట నడిస్తే ఆయన గెలుపు అవకాశాలుంటాయి. యువకుడు ఉత్సాహవంతుడు.. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కావడంతో ఈయనకు మంచి పేరు ఉంది. అదే ఎంపీగా గెలిపిస్తుందని ఆశిస్తున్నారు.

కాపు సామాజికవర్గమైన ఆకుల సత్యనారాయణ జనసేన నుంచి రాజమండ్రి ఎంపీ బరిలో ఉన్నారు. ఈయనకు అశేషంగా ఉన్న కాపు ఓట్లు పడుతాయా లేదా అన్న దానిపైనే విజయావకాశాలుంటాయి. ఆకుల క్షేత్రస్థాయిలో బలమైన నేతే. ఈయనకు క్యాడర్ - ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రధానంగా ఓట్లు చీల్చి టీడీపీ - వైసీపీ అభ్యర్థుల గెలుపు నిర్ధేశించే స్థాయిలో జనసేన అభ్యర్థి ఉన్నాడు. తేడా వస్తే గెలిచినా ఆశ్చర్యపోనక్కలేదంటున్నారు..మొత్తంగా ఈ త్రిముఖ పోటీలో రాజమండ్రి ఎంపీ సీటులో బోటాబోటీగానే ఎవరో ఒకరు గెలుస్తారు.. మరి ఈ టఫ్ ఫైట్ విజేతను చెప్పాలంటే ఫలితాల వరకూ వేచిచూడాల్సిందే..

Related News