Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విశాఖలో అసలు హీరో ఎవరు... జేడీ నా...పవనా....?

Category : politics

ఇప్పటికే జనసేన గోదావరి జిల్లాల తో పాటు ఉత్తరాంధ్ర ,విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల తో పాటు విశాఖ లోనూ పాగ వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ఏపి రాజకీయాలు ఓ కొలిక్కి వస్తున్న ఈ నేపధ్యంలో జనసేన పార్టీ ఓ అడుగు ముందుకేసి మరి విశాఖ రాజకీయాలపై ఫోకస్ చేసింది అందులో భాగంగానే తనకు పట్టున్న స్థానాలను పక్కన పెట్టి మరి. విశాఖ జిల్లా గాజువాక నియోజక వర్గ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గా బరి లో నిలవడం. అక్కడి స్థానిక ప్రజలకు మరింత దగ్గర చేస్తుంది అనే చెప్పాలి. కేవలం పవన్ ఒక్కడే కాకుండా ఆ పార్టీ నుంచి మరో బలమైన నేత సైతం ఇదే జిల్లా నుంచి పార్లమెంట్ స్థానానికి గాను పోటీ చేస్తూ ఉండడం. స్థానికంగా ఆ పార్టీకి మరింత బలాన్ని చేకూర్చనున్నది.

నిజానికి మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అనంతపురం జిల్లా కదిరి ఆయన శాశ్వత చిరునామా అయినప్పటికీ ఆయన విశాఖ నుంచి బరిలో నిలవడం విశేషం. ఇది ఇలా ఉంటే ఈ జిల్లా నుంచి పోటీ బరిలో ఉన్న ఈ ఇద్దరు బలమైన నాయకులు...ఈ సారి జరిగిన ఎన్నికల్లో విశాఖ జిల్లా ఎవరిని ఆదరిస్తుంది.అన్నది ఓ పెద్ద ప్రశ్న గా మారింది.పవన్ గాజువాకలో పోటీకి నామినేషన్ వేసినపుడు ఆయన గెలుపు ఖాయం అనుకున్న వారంతా..... ఆ తరువాత ఏమైందో, ఏమో పవర్ స్టార్ అక్కడ పెద్దగా ప్రచారం చేయలేదు. మూడు సార్లు మాత్రమే ఆయన అక్కడికి వచ్చారు. మొత్తం గాజువాకలో పర్యటించలేదనే భావం స్థానిక జనాలలో సైతం ఉన్నది.ఇక పవన్ పార్టీకి నిర్మాణం పెద్దగా చేయలేదనే అభియోగం కూడా నెలకొన్నది . జనంలో నిలబడి వూపు తేవాల్సిన జనసేనాని సరిగా రాకపోవడం పెద్ద తప్పిదమేనని అంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. ఇక లోకల్, నాన్ లోకల్ అన్న ప్రశ్న తలెత్తినపుడు దాన్ని జనంలో ఉంచి అటు టీడీపీ, ఇటు వైసీపీ బలపడేందుకు ప్రయత్నం కూడా చేశాయి.

ఇక వైసీపీ అభ్యర్ధి తిప్పల నాగిరెడ్డి ఒక అడుగు ముందుకేసి తనకు చివరి సారి ఒక్క అవకాశం ఇవాలని కూడా కోరారు. ఆ సానుభూతి మంత్రానికి తోడు.... గాజువాకలో జగన్ చేసిన ప్రచారం మంచి వూపు తెచ్చింది అన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. ఇక పవన్ అభిమానులు కూడా వేగంగా సంభవించిన ఈ పరిణామాలపై కలవరపడి తమ వంతుగా అధినేతను గెలిపించేందుకు గట్టిగానే ప్రయత్నించారు. యధా శక్తి తో వారు ....తమ వంతుగా పార్టీకి వూపు తెచ్చారు. ఐతే ఇది గెలిచేందుకు సరిపోతుందా అన్నదే ఇపుడు పెద్ద ప్రశ్నలా ఉంది.ఇక విశాఖ ఎంపీగా పోటీ చేసిన జనసేన అభ్యర్ధి వీవీ లక్ష్మీ నారాయణ తక్కువ టైంలోనే మంచి వూపు తెచ్చారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఆయన తన సొంత ఇమేజ్ మీదనే ఆధరపడి ఈ ఎన్నికల్లో పోటీ చేశారనుకోవాలి. ఆయన జేడీగా పనిచేసిన తీరు, ఆయన నిబద్ధత వంటివి ఉపయోగపడ్డాయని అంటున్నారు. అందుకోసమే పెద్ద ఎత్తున ఓట్లు ఆయనకు పడ్డాయని చెబుతున్నారు. మొత్తానికి చూసుకుంటే పవన్ పోటీ చేసిన గాజువాకలో పవన్ కంటే కూడా జేడీకే ఎక్కువ ఓట్లు వస్తాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే అసలైన హీరోగా జేడీ నే జనంలో ఉంటారనే సందేహం కూడా లేకపోలేదు.

Related News