Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మంగళగిరిలో లోకేష్ ని ఓడించడానికి ప్రయత్నిస్తున్న ప్రముఖులెవరు ?

Category : state politics

నారా లోకేష్ ఇప్ప్పుడు అందరి చూపు ఇతని పైనే .. ఎన్నికల బరిలో తొలిసారి పోటీపడుతున్న నారా లోకేష్ టీడీపీ అధినేత తండ్రి చంద్రబాబు అండతో మంత్రి అయ్యారని అందరికి తెలుసు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికలలో గెలవాలనే సంకల్పంతో మంగళగిరి నుండి పోటీ చేస్తున్నారు . కాగా వైసీపీ తరుపున సిట్టింగ్ MLA ఆళ్ల రామకృష్ణా రెడ్డి పోటీ పడుతున్నారు .

రాష్టంలో మిగతా నియోజకవర్గల గురించి పక్కన పెడితే మంగళగిరి మాత్రం చాలా ప్రత్యేకం అనే చెప్పాలి . మొదట్లో ఇక్కడ ఎన్నికల పోరు చాలా గట్టిగా ఉంటుంది అనుకున్నారు రాజకీయ విశ్లేషకులు కానీ గత వారం రో జులుగు చూసుకుంటే వార్ వన్ సైడ్ లాగా కనిపిస్తుంది . నియోజకవవర్గం మొత్తం టీడీపీ నామమే వినబడుతుంది . ఇది గమనించిన వైసీపీ గ్యాంగ్ ఇక లాభం లేదని లోకేష్ దూకుడికి బ్రేక్స్ వెయ్యాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు .

నిజం చెప్పాలంటే చంద్రబాబుకు వెతిరేకంగా ఉన్నవాళ్లు అందరు ఆయనను ఓడించడం కష్టం కనుక లోకేష్ పై ప్రభావం చూపిస్తున్నారు . మంగళగిరిలో లోకేష్ ని ఎలాగైనా ఓడించాలని చాలా విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు .

కులాలను రెచ్చగొడుతు , ఫేక్ సర్వేలను ప్రజలకు చూపిస్తూ , ప్రజలకు టీడీపీ గురించి తప్పుడు ప్రచారం చేస్తూ వైసీపీ వంకరు బుద్దిని బయటపెడుతున్నారు .. అంతే కాకుండా చాలామంది తెరవెనుక నాయకులు లోకేష్ ని ఎలా గైన గెలవనివ్వకూడదని సొంత డబ్బు కూడా ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది . ఫైనల్ గా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మంగళగిరిలో కచ్చితంగా టీడీపీ మాత్రమే వస్తుందిఅని .. ఇది అక్కడి ప్రజల మాట కనుక ఇదే ఫైనల్ అంటున్నారు టీడీపీ నాయకులు .

Related News