//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రవిశాస్త్రిని ఎంపిక చేసినా ప్రాబల్యం తగ్గించిన గంగూలీ !

Category : sports

గత సంవత్సరం వలే ర‌విశాస్త్రిని టీమిండియా హెడ్ కోచ్ గా నియమించకుండా అడ్డుకోవడంలో విఫలమైనా అతని ప్రాబల్యాన్ని మాత్రం సౌరబ్ గంగూలీ తగ్గించగలిగిన్నట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం సచిన్ టెండూల్కర్ పట్టుదల వల్లనే ర‌విశాస్త్రిని అడ్డుకోవడంలో గంగూలీ వెనుకడుగు వేయవలసి వచ్చినట్టు  తెలుస్తున్నది. 

కోచ్ ఎంపిక  క్రికెట్ అడ్వైజ‌రీ క‌మిటీ (సిఎసి) చేతుల్లోనే ఉండడం, దానికి చీఫ్ గంగూలీ కావ‌డంతో ర‌విశాస్త్రికి ఈసారీ క‌ష్ట‌మే అన్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అందుకు త‌గిన‌ట్లే మ‌ధ్య‌లో సెహ్వాగ్ పేరు కూడా బ‌లంగా తెర‌పైకి వ‌చ్చింది. కానీ చివ‌రికి విరాట్ కోహ్లి కోరుకున్న‌ట్లు ర‌విశాస్త్రినే నియ‌మించ‌క త‌ప్ప‌లేదు.

వాస్తవానికి ఈ సారి కూడా ర‌విశాస్త్రికి కోచ్ ప‌ద‌వి ద‌క్క‌కుండా ఉండేందుకు గంగూలీ ప్ర‌య‌త్నించచినా  సభ్యుడైన స‌చిన్  టీమ్ కోరుకున్న వ్య‌క్తినే కోచ్‌గా ఇవ్వ‌డం క‌రెక్ట్ అని గంగూలీని ఒప్పించారు. అయితే హెడ్ కోచ్ ప‌ద‌విలో త‌న మాట నెగ్గ‌క‌పోయినా బౌలింగ్ కోచ్ విష‌యంలో మాత్రం ర‌విశాస్త్రి కోరుకున్న భ‌ర‌త్ అరుణ్‌ను కాద‌ని త‌న చాయిస్ జ‌హీర్‌ఖాన్‌ను గంగూలీ నియ‌మించాడు. 

అటు విదేశాల్లో ప్ర‌త్యేకంగా బ్యాటింగ్ క‌న్స‌ల్టెంట్ అంటూ ద్ర‌విడ్‌ను నియ‌మించడం ద్వారా  ర‌విశాస్త్రి పాత్ర‌ను ప‌రిమితం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. జ‌హీర్‌ను బౌలింగ్ కోచ్‌ను చేస్తానంటేనే ర‌విశాస్త్రికి ప‌ద‌వి ఇవ్వ‌డానికి అంగీక‌రిస్తాన‌ని గంగూలీ తేల్చి చెప్పాడ‌ని బోర్డు వ‌ర్గాలు తెలిపాయి. జ‌హీర్‌కి ఉన్న అనుభ‌వం, ఇప్పుడున్న టీమ్‌తో ఉన్న మంచి సంబంధాల కార‌ణంగా అత‌ని పేరును ఎవ‌రూ వ్య‌తిరేకించ‌లేక‌పోయారు.