Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్థానిక పరిషత్ ఎన్నికల్లో ఐన జనసేన పార్టీ పట్టు సాగిస్తుందా లేదా ఇదే విషయంపై పవన్ పునరాలోచన.

Category : politics

మొన్న జరిగిన ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ తో పాటు ఘోరంగా ఓడిపోయిన మరోపార్టీ జనసేన పార్టీ కావడం గమనార్హం.అందరూ ఊహించినట్టు కనీసం ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు సైతం అందకుండా 3 స్థానాలు కూడా గెలవలేకపోయింది. కేవలం ఒక్క స్థానంతో జనసేన సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి... ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల తర్వాత పూర్తిగా సైలెంటైపోయిన పవన్ కళ్యాణ్... సినిమాల్లోకి వెళ్లననీ, తన జీవితం ప్రజా సేవకే అంకితం అనీ ఆయన తాజా గా ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తుండటంతో... సమీక్షలపై ఆయన పూర్తి దృష్టిసారిస్తున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు, ఎందుకు ఓడిపోయిందీ రిపోర్టులు తెమ్మన్న పవన్ కళ్యాణ్... ఇవాళ్టి నుంచీ చర్చిద్దామని పిలుపిచ్చారు.

జనసేన సీట్లు సాధించలేకపోయినా, ఓట్లు బాగానే సాధించిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. డబ్బులేవీ పంచకుండా జీరో పాలిటిక్స్ కి తెర తీసిన పవన్ .ఒక రకంగా ప్రజల మద్దతు చూరగిన్నరనే చెప్పుకోవాలి.ఈ లెక్కన ఆ పార్టీ కి ప్రజలు వేసిన ఒక్కొక్క ఓట్....ఎంతో పవిత్రమైనవి గా భావిస్తున్నారు, ప్రజలు పార్టీపై అభిమానంతో వేసిన ఓట్లనీ, అవే తమకు కొండంత ధైర్యాన్ని తెస్తున్నాయని ఆ పార్టీ అధినేత నుంచి నాయకుల వరకు అనుకుంటున్న మాట. ఈ నేపధ్యంలో నే రానున్న స్థానిక పరిషత్ ఎన్నికల పై నేటి పూర్తి దృష్టి కేంద్రీకరించారు ఆ పార్టీ అధినేత.అందుకే నేటి నుంచీ ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అభ్యర్థులతో పవన్ సమీక్షలు నిర్వహించనున్నారు.

కొవ్వూరు, గోపాలపురం నియోజక వర్గాల నుంచీ బీఎస్పీ, ఉండి నియోజకవర్గం నుంచీ సీపీఎం అభ్యర్థులు, 12 నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థుల్ని సమీక్షలకు పిలిచారు పవన్ కళ్యాణ్.సమీక్షల్లో ఓటమికి కారణాలతోపాటూ... ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా అధినేత చర్చించబోతున్నారు. వైసీపీ అధికారం లోకి వచ్చి ఇప్పటికే వారం రోజులు మాత్రమే అయ్యింది కాబట్టి... వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంటుందనీ, అలాంటి సమయంలో... ప్రభుత్వానికి పోటీగా బరిలో దిగితే ఎంతవరకూ కలిసొస్తుందనే అంశంపై కూడా ఆయన దృష్టి కేంద్రీకరించారనీ తెలుస్తుంది.ఇప్పటికే తెలంగాణ స్థానిక పరిషత్ ఎన్నికల్లో సైతం జనసేన పార్టీ తమ ప్రభంజనం కొనసాగించిన ఈ తరుణంలో ....ఇప్పుడు ఏపి లో జరగబోయే ఎన్నికల్లో ఏ మేరకు తమ ప్రభావం చూపిస్తుందొ చూడాలి.