పాకిస్థాన్ బ్యాటింగ్ దిగ్గజాలు యూనిస్ ఖాన్, మిస్బావుల్ హక్‌లు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు ప్రకటించిన విషయం తెలిసిందే. వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్నా సిరీస్ తమకు చివరిదని, సిరీస్ లో రాణించి ఘనంగా కెరియర్ ను ముంగిచాలనుకున్న ఈ ఈ ఇద్దరు వెటరన్లకు జట్టు సహచరులు సిరీ్‌సను (2-1) కానుకగా అందించారు. విండీస్ గడ్డపై తొలి టెస్ట్ సిరీస్ గెలిచి తమ కెరియర్ ను విజయంతో ముగించారు. 2000లో అరంగేట్రం చేసిన యూనిస్ 118 టెస్ట్‌ల్లో 52.5 సగటుతో 10,099 (34 సెంచరీలు, 33 అర్ధ సెంచరీలు) పరుగులు చేయగా.. 2001లో జట్టులోకొచ్చిన మిస్బా 75 టెస్ట్‌ల్లో 46.62 సగటుతో 5,222 (10 శతకాలు, 39 హాఫ్ సెంచరీలు) పరుగులు సాధించాడు.