//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డిసెంబర్ 31 తర్వాత కొన్ని ఫోన్ల కు వాట్సాప్ బంద్...మీ ఫోన్ చెక్ చేసుకోండి

Category : business

స్మార్ట్ ఫోన్లు వచ్చాక సోషల్ మీడియా వాడకం పెరిగింది. ముఖ్యంగా తమ సమాచారాన్ని చేరవేరయడానికి ఫేస్ బుక్ మెసెంజర్ ను ఉపయోగించేవారు. వాట్సాప్ యాప్ వచ్చిన తర్వాత ఎక్కువగా దీని సేవలనే ఉపయోగించుకుంటున్నాం.!! కాగా ఈ వాట్సప్ సేవలను ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31 నుంచి కొన్ని మొబైల్ ప్లాట్ ఫామ్ లకు నిలిపివేయనున్నట్లు ఆ సంస్థ శాన్ ఫ్రాన్సిస్కో ప్రకటించింది.

దీంతో బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, అంతకంటే పాత ప్లాట్ ప్లామ్ లకు ఈ వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. వీటికి సంబంధించి భవిష్యత్ లో ఎటువంటి అప్ డేట్స్ కూడా అభివృద్ధి చేయడం లేదని. కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చని.. ఆ సంస్థ ప్రకటించింది.

అయితే ఓఎస్ బేస్డ్ ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 801+ ల్లో కొత్త ఓఎస్ వెర్షన్ అప్ డేట్ చేసుకొంటే.. వాట్సాప్ సేవలను పొందవచ్చు అని చెప్పింది. అంతేకాదు.. నోకియా ఎస్ 40 ఫోన్లలో వాట్సప్ సేవలు ఈ నెల 31 తర్వాత బంద్ కానున్నాయి అని సంస్థ చెప్పింది.