ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది వాడుతున్న మెసెంజర్ యాప్ వాట్సాప్. సాధారణ వ్యక్తి నుండి సెలబ్రెటీ వరకు అందరూ వాట్సాప్ ఫీచర్ ను వాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు వాట్సాప్ తోనే కాలం గడిపేస్తున్నారు. అలాంటిది ఓ రోజు ఈ వాట్సాప్ సేవలు బంద్ అయితే తట్టుకోగలరా అంటే తట్టుకోలేరని చెప్పాలి. కానీ ప్రస్తుత వార్తలు బట్టి చూస్తే తట్టుకోవాలి అనే తెలుస్తుంది. ఎందుకంటే వాట్సాప్ సేవలు కొన్ని ఫోన్లలో బంద్ కాబోతున్నాయి.
జూన్ 30 తర్వాత వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అయితే అన్ని ఫోన్లలో కాదు. కేవలం కొన్ని ఫోన్లలో మాత్రమే. ఈ ఫోన్లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ కు సపోర్ట్ నిలిపివేశామని దీంతో వాట్సాప్ ఆ ఫోన్లలో పనిచేయదని గతంలోనే ఆ సంస్థ తెలియజేసింది. అయితే దీనిపై యూజర్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆ నిర్ణయాన్ని వాట్సాప్ అప్పటికి వాయిదా వేసింది. కానీ... జూన్ 30 తర్వాత అదే నిర్ణయాన్ని అమలు చేయాలని వాట్సాప్ యోచిస్తోంది. ఈ నిర్ణయం కనుక అమలైతే.. చాలావరకు ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్ చేయకపోవచ్చు. కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపిన ప్రకారం.. ఈ కింద ఇచ్చిన ఫోన్లలో జూన్ 30 తర్వాత వాట్సాప్ సపోర్ట్ పనిచేయదు అని తెలిపారు.
బ్లాక్ బెర్రీ (బ్లాక్ బెర్రీ 10 సహా)
నోకియా ఎస్ 40
నోకియా సింబియన్ ఎస్ 60
ఆండ్రాయిడ్ 2.1 , ఆండ్రాయిడ్ 2.2
విండోస్ ఫోన్ 7.1
ఐఫోన్ 3జీఎస్/ఐవోఎస్ 6