Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాట్సాప్‌లో కొత్తగా పిన్ చాట్స్

Category : world business

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్తఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే లైవ్‌ లొకేషన్‌, ఛేంజ్‌ నంబర్‌ తదితర ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్‌లో త్వరలో ఫేవరెట్ చాట్‌ ఆప్షన్‌ను తీసుకురానున్నారు. దీని ద్వారా మనకు ఇష్టమైన వ్యక్తిగత లేదా గ్రూప్‌ చాట్‌ను పిన్‌ చేయడంతో దాన్ని టాప్‌లో ఉంచుకునే అవకాశం కలగనుంది. ఈవిధంగా మూడు ఫేవరెట్‌ చాట్‌లను మాత్రమే పిన్‌ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో టాప్‌ బార్‌లో పిన్ చాట్స్ ఆప్షన్‌ కనిపించనుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ వర్షన్‌ కోసం ప్రయోగదశలో ఉన్న ఈ ఫీచర్‌ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

Related News