//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వాట్సప్ ఏడుగురు ప్రాణాలను తీసింది.

Category : national

సాధారణంగా ఆ ప్రాంతంలో ఉండే గిరిజనులు చాలా ప్రశాంతంగా ఉంటారు. అయితే వాట్సప్ లో వచ్చిన పుకార్లు వారిని చాలా భయపెట్టాయి. తమ పిల్లలకు ఏమైనా అవుతుందనే భయంతో వారు అనుమానితులను కొట్టి చంపారు. కొందరు దుండగులు పిల్లలను ఎత్తుకుపోతున్నారన్న ప్రచారం వాట్సాప్ వేదికగా మొదలవడంతో జార్ఖండ్ లోని సింగ్బం జిల్లాలో ఈ దారుణం జరిగింది. సింగ్బం జిల్లాలోని రెండు గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు కొందరిని పట్టుకుని దారుణంగా కొట్టారు. దీంతో వారిలో ఏడుగురు మరణించారు.

ఈ కేసుకు సంబంధించి 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు.పోలీసులు వచ్చినప్పుడు కూడా గ్రామస్తులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని వాళ్లను అక్కడకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఆ సందర్భంగా చేసిన దాడిలో కొందరు పోలీసులకు సైతం గాయాలయ్యాయి. పోలీసుల కార్లు జీపులను కూడా తగలబెట్టేశారు. ఇటీవల కాలంలో వాట్సప్ లో ఇలాంటి వదంతులు ఎక్కువవుతున్నాయి. వాట్సప్ వినియోగదారులు కూడా ఏది నిజమో అదే షేర్ చేస్తే బాగుటుంది కదా....అంతేకాకుండా ఇలాంటి పుకార్లు వల్ల అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు.

Related News